ప్రపంచంలో కోవిడ్ బాధితుల రికవరీలో అగ్రస్థానంలో భారత్

India Maintains Top Global Ranking with Maximum Covid-19 Recoveries

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల పరంగా భారత్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రికవరీలలో భారత్ వాటా అత్యధికంగా 21 శాతం ఉండగా, అమెరికా 18.4, బ్రెజిల్ 16.3 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు మరణాల రేటు(కేస్ ఫాటాలిటీ రేట్- సీఎఫ్ఆర్‌) కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువని పేర్కొన్నారు. గ్లోబల్ గా సీఎఫ్‌ఆర్‌ 2.97శాతంగా ఉండగా, భారత్‌లో 1.56 శాతంగా ఉందని చెప్పారు.

మరోవైపు అక్టోబర్ 3, శనివారం ఉదయానికి దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 54 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 75,628 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 54,27,706 కు చేరుకుంది. కొత్తగా కోలుకున్న 75,628 మందిలో 74.36% మంది 10 రాష్ట్రాలు/కేంద్రప్రాంతాల నుండి నివేదించబడినట్టు తెలిపారు. అలాగే గత వారం రోజుల్లో 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు నివేదికలో వెల్లడైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =