దేశంలో నేటి నుండి పెరగనున్న పలు నిత్యావసరాల ధరలు.. వివిధ వస్తువులు మరియు సేవలపై జీఎస్‌టీ పెంపు

India Prices of Many Items Increased Due To New GST Rates Comes Into Effect From Today, Prices of Many Items Increased Due To New GST Rates Comes Into Effect From Today, New GST Rates Comes Into Effect From Today, New GST Rates, GST rates revised, Goods and Services Tax, 18 % Goods and Services Tax will be applicable on bank cheque book/loose leaf cheques, 18 % GST will be applicable on bank cheque book/loose leaf cheques, GST Council approved changes to the tax structure, New GST rates today onwards, New GST Rates News, New GST Rates Latest News, New GST Rates Latest Updates, New GST Rates Live Updates, Mango News, Mango News Telugu,

సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం తాజాగా మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గత నెలలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 47వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త వస్తు, సేవా పన్ను (జీఎస్‌టీ) రేట్లు అమల్లోకి వచ్చాయి. అనేక వస్తువులు మరియు సేవలకు కొత్త పన్నులు అమలులోకి వచ్చాయి. దీంతో ఇక నుంచి నిత్యవసర ఆహార పదార్థాలకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ఉత్పత్తులపై జీఎస్‌టీని పెంచుతుండగా, కొన్నింటిపై తక్కువ ధరకు నిర్ణయించారు. సోమవారం నుంచి పెరిగిన వివిధ వస్తువుల ధరలు ఇలా ఉన్నాయి.

  • పెరుగు, లస్సీ, పనీర్, తేనె, తృణధాన్యాలు, మాంసం, చేపలు, ఆసుపత్రిలో రూం రెంట్ రూ. 5000 పై ఉంటే 5% జీఎస్‌టీ వర్తిస్తుంది.
  • అట్లాస్‌తో సహా మ్యాప్‌లు, చార్ట్‌లపై, మరియు సోలార్ వాటర్ హీటర్లపై 12 శాతం జీఎస్‌టీ విధించబడుతుంది.
  • టెట్రా ప్యాక్‌లపై 18 శాతం జిఎస్‌టి విధించబడుతుంది.
  • చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుములపై ​​18 శాతం జీఎస్‌టీ విధించబడుతుంది.
  • ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, కటింగ్ బ్లేడ్‌లతో కూడిన కత్తులు, పేపర్ కత్తులు, పెన్సిల్ షార్పనర్‌లు, ఎల్‌ఈడీ ల్యాంప్స్, డ్రాయింగ్ మరియు మార్కింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై జీఎస్‌టీ రేట్లు గత 12 నుంచి 18 శాతానికి పెరగనున్నాయి.
  • రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు మరియు శ్మశానవాటికలకు సంబంధించిన వర్క్ కాంట్రాక్టులతో సహా సేవలపై జిఎస్‌టి ప్రస్తుత 12 శాతం నుండి 18 శాతానికి పెరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =