ప్రపంచ నెంబర్‌ వన్‌ టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం, 25 ఏళ్లకే రిటైర్‌మెంట్‌ ప్రకటన

World No 1 Tennis Player Ashleigh Barty Announces Retirement from Professional Tennis at the Age of 25, World No 1 Tennis Player, Ashleigh Barty Announces Retirement from Professional Tennis at the Age of 25, Ashleigh Barty Announces Retirement from Professional Tennis, Ashleigh Barty, World No 1 Tennis Player Ashleigh Barty, Tennis Player Ashleigh Barty, Ashleigh Barty World No 1 Tennis Player, Tennis Player, Professional Tennis Player, Professional Tennis Player Ashleigh Barty, Professional Tennis Player Ashleigh Barty Announces Retirement from Professional Tennis, Professional Tennis Player Ashleigh Barty Announces Retirement from Professional Tennis at the Age of 25, Ashleigh Barty Latest Updates, Ashleigh Barty Latest News, Tennis, No 1 Tennis Player, Mango News, Mango News Telugu,

ఉమెన్స్ టెన్నిస్ ప్రపంచ నెంబర్‌ వన్‌, ఆస్ట్రేలియా టెన్నిస్‌ క్రీడాకారిణి యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 సంవత్సరాల వయస్సులో ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది. యాష్లే బార్టీ రిటైర్‌మెంట్‌ నిర్ణయంతో టెన్నిస్ ప్రపంచం, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2021లో వింబుల్డన్‌ గెలుచుకున్న యాష్లే బార్టీ, ఈ జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2022 విజేతగా నిలిచి తన కెరీర్‌లో మొత్తం మూడు గ్రాండ్‌ స్లామ్‌ లను సొంతం చేసుకుంది. అలాగే ఉమెన్స్ టెన్నిస్ లో 121 వారాల నుంచి ఆమె ప్రపంచ నెంబర్‌ వన్‌ గా కొనసాగుతుంది. అత్యధిక కాలం ప్రపంచ నెంబర్‌ వన్‌ నిలిచిన వారిలో స్టెఫీ గ్రాఫ్, సెరెనా విలియమ్స్, మార్టినా నవ్రతిలోనా తర్వాత ఆమె నాలుగో స్థానంలో నిలిచింది.

రిటైర్‌మెంట్‌ పై సోషల్‌ మీడియా వేదికగా యాష్లే బార్టీ ప్రకటన చేస్తూ, “నేను టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందున ఈరోజు నాకు కష్టంగా మరియు భావోద్వేగంతో నిండిపోయింది. ఈ వార్తలను మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియలేదు కాబట్టి నాకు సహాయం చేయమని నా మంచి స్నేహితురాలు కేసీడెల్లక్వాని అడిగాను. ఈ క్రీడ నాకు అందించిన ప్రతిదానికీ నేను చాలా కృతజ్ఞతతో, గర్వంగా మరియు నెరవేర్చినట్లు భావిస్తున్నాను. ఈ మార్గంలో నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, మనం కలిసి సృష్టించిన జీవితకాల జ్ఞాపకాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. రేపు నా విలేకరుల సమావేశంలో మరిన్ని వివరాలు తెలియజేస్తాను” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =