భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్: రెండు రోజునే భారత్ సంచలన విజయం

3rd Test Narendra Modi Stadium, Axar Gets 6 Wickets, England All Out For 112 in First Innings, Highlights India vs England 3rd Test, India v England, India vs England 3rd Test, India vs England 3rd Test Day 1 Highlights, India vs England 3rd Test Highlights, India vs England 3rd Test Live Score, India vs England 3rd Test Match, India vs England 3rd Test news, India vs England Live Score, India vs England Live Score 3rd Test, Mango News

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ (డే/నైట్) లో భారత్ జట్టు‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ లో భారత్ 2-1 తో ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లాండ్ నిర్దేశించిన 49 పరుగుల లక్ష్యాన్ని 7.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా భారత్ జట్టు ఛేదించి టెస్టు ప్రారంభమైన రెండో రోజునే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (25), శుభమన్‌ గిల్ (15) పరుగులు చేశారు.

ముందుగా 99/3 వద్ద రెండో రోజు తోలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ జట్టు 145 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (66), కెప్టెన్ విరాట్ కోహ్లీ (27 ) పరుగులతో రాణించారు. పిచ్ స్పిన్నర్లుకు అనుకూలించడంతో జో రూట్ 5, జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ లో అక్షర్‌ పటేల్‌ వేసిన తొలి ఓవర్‌లోనే ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ డకౌట్ గా వెనుదిరిగారు. తొలి బంతికే ఓపెనర్‌ జాక్‌ క్రాలీ, మూడో బంతికి జానీ బెయిర్‌ స్టో పెవిలియన్ బాటపట్టారు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ద్వయం దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పూర్తిగా చేతులెత్తశారు. కెప్టెన్ జో రూట్ (19), బెన్ స్టోక్స్ (25) కొద్దిగా పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 81 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు, అశ్విన్‌ నాలుగు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 33 పరుగుల ఆధిక్యం రావడంతో, ఇక మిగిలిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ వికెట్‌ నష్టపోకుండా ఛేదించి ఇంగ్లాండ్ పై మరో సంచలనం విజయాన్ని నమోదు చేసింది. ఈ డే/నైట్ పింక్ బాల్ టెస్ట్ రెండు రోజులు కూడా దాటకుండానే భారత్ ఘన విజయంతో ముగిసింది.

ఈ టెస్టులో బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో తన 400 వికెట్‌ ను దక్కించుకున్నాడు. జోఫ్రా ఆర్చర్‌ను ఎల్బీగా వెనక్కి పంపి 400 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్ లో చేరాడు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తరువాత 400 వికెట్లు సాధించిన భారత్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఇక ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 11 వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4 నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలోనే జరగనుంది.

భారత్–ఇంగ్లాండ్ మూడో టెస్టు వివరాలు:

ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్: 112-10

  • జాక్‌ క్రాలీ (53), జో రూట్‌ (17)
  • అక్షర్ పటేల్ 6/38, అశ్విన్ 3/26

భారత్ తోలి ఇన్నింగ్స్: 145-10

  • రోహిత్ శర్మ (66), కెప్టెన్ విరాట్ కోహ్లీ (27)
  • జో రూట్ 5/8, జాక్ లీచ్ 4/54

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్: 81-10

  • బెన్ స్టోక్స్ (25), జో రూట్ (19)
  • అక్షర్ పటేల్ 5/32, అశ్విన్ 4/48

భారత్ రెండవ ఇన్నింగ్స్: 49-0

  • రోహిత్ శర్మ (25), శుభమన్‌ గిల్ (15)
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 6 =