బీఆర్ఎస్ బహిరంగ సభ: సీఎం కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్

BRS Public Meeting CMs Pinarayi Vijayan, Arvind Kejriwal and Bhagwant Mann Speech at Khammam,CM KCR Inaugurates Khammam District Integrated Offices' Complex, CM's Kejriwal, pinarayi Vijayan, Bhagwant Mann Attends,Mango News,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్‌) ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అభివృద్ధిపథంలో సాగుతోందని, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నారు.
  • కేంద్రంపై పోరాడేందుకు అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు.
  • సీఎం కేసీఆర్‌ చేపడుతున్న పోరాటాలకు మా మద్దతు ఉంటుంది.
  • దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
  • బీజేపీ వైఖరితో దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది.
  • రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోంది, గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
  • దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారు, నరేంద్ర మోదీ పాలనలో ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతింటోంది.
  • రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కేసీఆర్‌కు అభినందనలు.

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతం.
  • కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చాలా నేర్చుకున్నాం, ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం.
  • దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా? రైతులకు, కార్మికులకు ఏం చేయాలి? అనే అంశాలపై విపులంగా చర్చించాం.
  • గవర్నర్‌ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. ప్రజామోదంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోంది.
  • తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు.
  • కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ గవర్నర్లు రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
  • కేరళలో ఉన్న విద్యావ్యవస్థ దేశం మొత్తం మీద ఎందుకు లేదో కేంద్రం చెప్పాలి.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • సీఎం కేసీఆర్ ఈరోజు కొందరికి కంటి వెలుగు అద్దాలిచ్చారు, ఇంతమంది జనాన్ని చూడాలంటే మాకు కూడా స్పెషల్ అద్దాలు ఇవ్వాలి.
  • తెలంగాణలో అమలవ్వుతున్న కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం. దీనిని పంజాబ్ లోనూ అమలు చేస్తాం.
  • నేటి ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో మార్పునకు తొలి సంకేతం. బీజేపీపై పోరుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.
  • దేశమనే పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పూలు ఉంటేనే బాగుంటుంది, కానీ, బీజేపీ ఒకే రంగు పువ్వులు ఉండాలని కోరుకుంటోంది.
  • దొడ్డిదారిన అధికారంలోకి రావడంలో బీజేపీ నెంబర్‌ వన్. ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టడం అందరం చూశాం.
  • ఎర్రకోటపై గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ సేమ్ స్పీచ్ ఇస్తున్నారు.. దేశాన్ని ఎలాగూ మార్చలేరు, కనీసం తన స్పీచ్‌నైనా మోదీ మార్చుకోవాలి.
  • ప్రధాని మోదీ తన మిత్రుల కోసం పనిచేయడం మానుకుని సామాన్య ప్రజల కోసం పనిచేయాలి.
  • దేశంలో 130 కోట్ల మంది ప్రజలు నిజాయితీగానే ఉంటున్నారు, కానీ అదే నిజాయితీ నేతల్లో మాత్రం కొరవడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =