ఈ 52 చైనా యాప్స్‌పై నిషేధం విధించండి – ఇండియన్ ఇంటెలిజెన్స్

52 Chinese Mobile Apps, 52 Mobile Apps Linked to China Pose Security Threat to India, Chinese apps, India Internal Security Situation, Indian Intel agencies, Indian Intelligence Agencies, Indian intelligence red-flagged Zoom, Intel agencies, Security Threat to India, TikTok, Unmasking China

చైనా దేశానికి కు సంబంధించిన 52 యాప్స్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా ప్రజలను వాడొద్దని సూచించాలని భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ యాప్స్ సురక్షితం కాదని, పెద్ద మొత్తంలో వ్యక్తిగత డేటాను సేకరించే అవకాశం ఉన్నందువలన వీలైతే వెంటనే వాటిని నిషేధించాలని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వర్గాలు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల సిఫారసులకు జాతీయ భద్రతా మండలి మద్దతునిచ్చిందని, ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏజెన్సీలు ప్రభుత్వానికి పంపించిన యాప్స్ జాబితాలో టిక్‌టాక్‌, జూమ్‌, యూసీ బ్రౌజర్‌, షేర్‌ ఇట్‌, బ్యూటీ ప్లస్‌, హలో, క్లీన్‌ మాస్టర్‌ తదితర యాప్స్ ఉన్నాయి.

భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సూచించిన యాప్స్ జాబితా:

  • టిక్‌టాక్‌, జూమ్‌, యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్, షేర్‌ ఇట్‌, బ్యూటీ ప్లస్‌, హలో, క్లీన్‌ మాస్టర్
  • వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వి చాట్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, లైక్
  • క్వయ్‌, రోమ్‌వే, షిఇన్‌, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్‌, పార్కెల్ స్పేస్, మెయిల్ మాస్టర్, వి సింక్, సెల్ఫీసిటీ, క్లాష్ ఆఫ్ కింగ్స్
  • పర్ఫెక్ట్ కార్ప్, సిఎం బ్రౌజర్, వైరస్ క్లీనర్, ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్‌, యూక్యామ్‌ మేకప్, ఎంఐ స్టోర్, ఎంఐ వీడియో కాల్-షియోమి, 360 సెక్యూరిటీ, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ బ్రౌజర్‌, డీయూ క్లీనర్‌, డీయూ ప్రైవసీ
  • క్యాచీ క్లియర్‌ డియూ యాప్స్‌ స్టూడియో, బైదూ ట్రాన్స్‌లేట్‌, బైదూ మ్యాప్, వండర్‌ కెమెరా, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచర్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + two =