డ్యాన్స్ చేస్తూ చనిపోతున్నవారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది?

Is there a connection between dancing and heart attacks,dancing and heart attacks,connection between dancing and heart,Mango News,Mango News Telugu,Why are so many heart attack cases happening,Can dancing cause heart attack,dance, heart attacks, people dying while dancing,heart attack while dancing,reduce risk from heart disease,dancing and heart attacks News Today,dancing and heart attacks Latest News
dance, heart attacks, people dying while dancing,

ఈ ఏడాది దసరా నవరాత్రులు ఘనంగా ముగిసాయి. ఎంతో మంది ఆనందంగా బంధుమిత్రులతో  డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాలల్లో డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన ఘటనలు ఎంతోమందిని తీవ్ర విషాదంలోకి నెట్టగా .. డ్యాన్స్ చేస్తూ చనిపోవడం ఏంటనే ప్రశ్నలను డాక్టర్ల ముందు నిలబెట్టాయి.

ఒకప్పుడు డ్యాన్స్ చేస్తే టెన్సన్స్, ఆందోళన పారిపోతాయి.. కోపం, బీపీ పరారవుతాయని డ్యాన్స్‌ను ఎంకరేజ్ చేసినవాళ్లంతా ఆగండాగండి అంటున్నారు. డ్యాన్స్ చేస్తే ఆందోళనకు గురవుతారు.. డ్యాన్స్ చేస్తే చనిపోయినా చనిపోతారంటూ హెచ్చరిస్తున్నారు. అవును దసరా నవరాత్రుల సందర్భంగా డ్యాన్స్ చేస్తూ మరణించిన ఘటనలతో దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.  దసరా సంబురాల్లో డ్యాన్స్ చేస్తూ.. దాండియా ఆడుతూ.. గర్భా డ్యాన్స్ చేస్తూ.. అక్కడికక్కడే కుప్పకూలి 10 మంది వరకూ చనిపోయారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన వారు.. క్షణాల్లోనే కళ్ల ముందు విగతజీవులుగా మారిపోయారు.

దీంతో డ్యాన్స్ చేస్తే.. అది  గుండెపోటుకు కారణమవుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు అందర్లోనూ తలెత్తుతోంది. అయితే డ్యాన్స్ సాధారణంగా ఆరోగ్యానికి మంచిది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులలో డ్యాన్స్  చేస్తే వారిలో గుండెపోటు రాదు. వారిలో ఇప్పటికే గుండె సమస్యలు, మూసుకుపోయిన ధమనులు, గుండె వైఫల్యం వంటివి ఉంటే వేగంగా డ్యాన్స్ చేయడం, ఎక్కుకసమయం డ్యాన్స్ చేయడం వల్ల వారి గుండెపై అదనపు భారం పడుతుంది.

డ్యాన్స్ అనేది శరీరానికి నిజంగానే  గొప్ప వ్యాయామం. కానీ వేగంగా చేయడం వల్ల చాలా సమస్యలకు దారితీయవచ్చు. డీహైడ్రేట్ కావటం, అలసట వచ్చి.. గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.అందుకే  డ్యాన్స్ చేసేటప్పుడు విరామం తీసుకోవడం, నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే డ్యాన్స్ చేసేటప్పుడు ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ చేస్తే ఈ ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్, డ్రగ్స్ హృదయ స్పందన రేటు, రక్తపోటును ఇబ్బందుల్లోకి నెట్టి.. గుండె సమస్యలకు దారితీయవచ్చు. అందుకే డ్యాన్స్ చేసేటప్పుడు వాటికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

బ్రేక్ డ్యాన్స్ లేదా ఇంటెన్స్ ఏరోబిక్ డ్యాన్స్ వంటివి..ఫిజికల్‌గా ఎక్కువ శ్రమను కలిగిస్తాయి. ఇప్పటికే వీటిలో అలవాటు ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే ఇలాంటి డ్యాన్స్‌లకు దూరంగా ఉంటేనే మంచిది.  అలాగే అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవాళ్లు కూడా గర్బాకు దూరంగా ఉండాలి.అంతేకాదు 40 ఏళ్లు దాటినవాళ్లు, గుండె జబ్బుల చరిత్ర ఉన్నవాళ్లు వేగంగా డ్యాన్స్ చేయడానికి దూరంగా ఉంటేనే మంచిది. డ్యాన్స్ చేసేవారిలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవాళ్లు డ్యాన్స్‌కు  దూరంగా ఉంటేనే మంచిది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =