మహిళలు సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలంటున్న పరిశోధకులు

Researchers want women to stay away from soft drinks,Researchers want women to stay away,women to stay away from soft drinks,Mango News,Mango News Telugu,cool drinks dangerous to health , Researchers, women stay away from soft drinks,cool drinks,soft drinks, women health,soft drinks Latest News,Researchers on soft drinks News Today,Researchers Latest News,Researchers Latest Updates
cool drinks dangerous to health , Researchers, women stay away from soft drinks,cool drinks,soft drinks, women health

కొంత కాలం క్రితం వరకూ సాప్ట్  డ్రింక్స్ అంటే  కేవలం  పార్టీలలో, ఫంక్షన్లలో మాత్రమే తాగేవారు. కానీ ఆ ప్లేసులో ఆల్కహాల్ వచ్చేసి.. కూల్  డ్రింక్స్‌ను రెగ్యులర్ డ్రింక్స్ లిస్టులోకి పంపేసింది. దీంతో టైమ్  లేదు  సందర్భం లేదు ఎప్పడు పడితే అప్పుడు తాగే డ్రింక్స్‌లో  కూల్ డ్రింక్  వచ్చేసింది. నీళ్లు తాగినట్లే కూల్ డ్రింక్స్ తాగడానికి జనాలు కూడా బాగా అలవాటు అయిపోయారు. కాస్త  షుగర్,  కావాల్సినంత కూలింగ్, కొంచెం సోడా ప్లేవర్‌ ఉండటంతో చిన్నపిల్లలు కూడా దీనిని తాగేస్తున్నారు.

చాలామంది  దాహం వేసినపుడు కూడా వాటర్ తాగడానికి బదులు దీనినే తీసుకుంటారు. వేసవి కాలంలో అయితే మరీ ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ  ఉంటారు. అయితే ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌లో చక్కెర, సోడియం, కెఫిన్ కంటెంట్ వల్ల.. మన శరీరంలో కాల్షియం తగ్గి, ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.సాఫ్ట్ డ్రింక్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ జీవనశైలి మందగించడమే కాదు

సాఫ్ట్ డ్రింక్స్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయని ఆర్థోపెడిక్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల 40 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తులలో ఎముక ఖనిజ సాంద్రత తగ్గడానికి దారి తీస్తుంది. ఇదే తర్వాత ఆస్టియోపోరోసిస్‌గా మారుతుంది. ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా పెద్దవారిలో ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెబుతున్నారు. చైనాలో 7 ఏళ్ల పాటు 17,000 మందిపై జరిపిన అధ్యయనంలో..పరిశోధకులు  ఈ వాస్తవాన్ని కనుగొన్నారు.

ఎముకల ఆరోగ్యంపై సాఫ్ట్ డ్రింక్స్ ప్రభావం దారుణంగా ఉంటుందట. ఎందుకంటే.. శీతల పానీయాలలో ఉండే చక్కెర, సోడియం, కెఫిన్ వల్ల మన శరీరంలో క్యాల్షియం తగ్గి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే బాడీ స్ట్రక్చర్ నుంచి వివిద శరీర భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే సాఫ్ట్ డ్రింక్స్ వల్ల కలిగే నష్టాల గురించి…మెయిన్‌గా ఎముకల ఆరోగ్యానికి జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

నిజానికి భారతీయ మహిళలు కూల్ డ్రింక్స్‌కు  దూరంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మిగిలిన దేశాల కంటే భారత దేశంలోని మహిళలు దశాబ్దం ముందుగానే ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు . మిగిలిన దేశాలలో కంటే భారత దేశంలోని మహిళలకు మెనోపాజ్‌కు ముందుగానే చేరుకుంటున్నారు. ఇతర దేశాలలో మహిళలకు 50 నుంచి 51 ఏళ్లకు మెనోపాజ్ రాగా ఇండియాలో మాత్రం అర్లీ మెనోపాజ్ బారిన పడుతున్నారు. మెనోపాజ్ సమయంలో మహిళల ఎముకలు వేగంగా అరిగిపోతాయి. ఇలాంటి సమయంలో కూల్ డ్రింక్స్ కూడా  తీసుకుంటే స్త్రీల ఎముకలు మరింతగా బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలు సాఫ్ట్ డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =