పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం

ISRO Successfully Launches Cartosat-3, 13 Commercial Nano Satellites Into Orbit,Mango News,Mango News,Breaking News Today,ISRO Cartosat-3 Mission,Cartosat-3 Launch Highlights,#ISRO,#Cartosat3,#PSLVC47,Satellite Cartosat-3,Cartosat-3 Mission Details,ISRO News Today

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 27, బుధవారం ఉదయం 9.28 గంటలకి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది, దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కార్టోశాట్‌-3 మరియు 13 అమెరికా నానోఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్ మోసుకెళ్లింది. ప్రయోగం జరిగిన 26.50 నిమిషాల వ్యవధిలోనే వివిధ దశల్లో 14 ఉపగ్రహాలను ఈ రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కార్టోశాట్‌-3 మరియు 13 అమెరికా నానో ఉపగ్రహాలు విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబడ్డాయని ఇస్రో ప్రకటించింది.

ఈ పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్వీ)-సీ47 ప్రయోగానికి నవంబర్ 26, మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టారు. 26 గంటలపాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ సాగించి, అధికారికంగా నిర్ణయించిన సమయమైనా బుధవారం ఉదయం 9.28 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ మోసుకెళ్లిన 1,625 కిలోల బరువున్న కార్టోశాట్‌-3 ఉపగ్రహం పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది, మరియు దీని యొక్క జీవితకాలం ఐదు సంవత్సరాలు. దేశ సైనిక సామర్థ్యాన్నీ పెంచడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో కూడ కార్టోశాట్‌-3 సేవలు ఉపయోగపడనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల పరిశీలన, గ్రామీణ వనరుల అధ్యయనానికి కూడ ఇది ఉపయోగపడనుంది. కార్టోశాట్‌-3 ఉపగ్రహం తయారీకి రూ.350 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =