ఇది రైతు ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్ పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన

2021 Telangana Assembly Budget Session, Agriculture Minister Singireddy Niranjan Reddy, Budget Session, Mango News, Minister Singireddy Niranjan Reddy, Singireddy Niranjan Reddy, telangana agriculture minister, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy, Telangana Assembly, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2021, Telangana Assembly Budget Sessions

దేశంలో వ్యవసాయరంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇది రైతు ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు, మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. “రైతుబంధు, రైతుభీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు బడ్జెట్ లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది. కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం, అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదింపజేశారు” అని మంత్రి పేర్కొన్నారు.

రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు:

“రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే రైతుభీమా కోసం రూ.1200 కోట్లు, రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించారు. 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.30 వేల సబ్సిడీ రైతులకు ఇచ్చేందుకు బడ్జెట్ లో నిధుల కేటాయించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది” అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − one =