ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ రాజీనామా, కొత్త కోచ్ ఎవరంటే?

Andrew McDonald, Andrew McDonald Appointed As Interim Australia Head Coach, Andrew McDonald appointed Australia’s interim head coach, Andrew McDonald Appoints as Interim Coach, Andrew McDonald to be Australia’s interim cricket coach, Australia, Australia appoint Andrew McDonald as interim head coach, Cricket Australia, Cricket Australia appoints Andrew McDonald, Justin Langer, Justin Langer Resigns as Australia Head Coach, Justin Langer Resigns as Australia Head Coach Andrew McDonald Appoints as Interim Coach, Justin Langer steps down as Australia head coach, Mango News

ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ కీలక నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్‌ గా జూన్‌ వరకు కొనసాగాల్సి ఉండగా, తాజాగా కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు అతడి మేనేజ్‌మెంట్‌ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం నాడు ప్రకటన చేసింది. “మా క్లయింట్ జస్టిన్ లాంగర్ ఈ ఉదయం ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు డీఎస్‌ఈజీ ధృవీకరించింది. నిన్న సాయంత్రం క్రికెట్ ఆస్ట్రేలియాతో సమావేశం అనంతరం రాజీనామా చేశారు. రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుంది” అని డీఎస్‌ఈజీ వరల్డ్ వైడ్ సంస్థ ప్రకటించింది. మరోవైపు జస్టిన్ లాంగర్ రాజీనామాను ఆమోదిస్తునట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. జస్టిన్ తో తమ ప్రస్తుత ఒప్పందానికి స్వల్పకాలిక పొడిగింపుకు ఒప్పుకున్నామని, అయితే అతను అందుకు అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాడని పేర్కొన్నారు. హెడ్ కోచ్ గా దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుకోవడం, ఆస్ట్రేలియా బోర్డు ఒప్పుకోకపోవడమే రాజీనామాకు కారణంగా తెలుస్తుంది.

తాత్కాలిక కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌: 

గత నాలుగు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు జస్టిన్ లాంగర్ అందించిన సేవలకు సీఈఓ నిక్ హాక్లీ కృతజ్ఞతలు తెలిపారు. అతను జట్టు సభ్యుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాడని కొనియాడారు. ఇక జస్టిన్ లాంగర్ స్థానంలో ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగే టీ20 సిరీస్‌ తో కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అధికారిక విధులు ప్రారంభమవుతాయని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =