ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Cut Salaries of MPs By 30 Percent, lok sabha, Lok Sabha Approves Bill to Cut Salaries of MPs, Lok Sabha nod to bill for 30% salary cut of MPs, Lok Sabha passes bill to cut salaries of MPs, lok sabha today, lok sabha today highlights, Parliament, parliament session, parliament session 2020

కరోనాపై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోతకు సంబంధిన ఆర్డినెన్స్ కు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి వేతనాల్లో కోత వర్తింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ఎంపీల వేతనాల కోతకు సంబంధించిన పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు,పెన్షన్‌ సవరణ బిల్లు-2020కు ‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుగుణంగా ఎంపీల వేతనాలు, పింఛన్లలో ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటుగా 30 శాతం కోత పడనుంది. మరోవైపు కరోనాపై పోరాటంలో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =