సీఎం ఉద్దవ్‌ థాకరేపై వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ్‌ రాణేను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

Maharashtra Police, Maharashtra Police arrest Union minister Narayan Rane, Maharashtra Police Detained Union Minister Narayan Rane, Mango News, Narayan Rane Arrest LIVE Updates, Police arrest Union minister Narayan Rane, Union Minister Narayan Rane, Union minister Narayan Rane arrested for remark, Union minister Narayan Rane arrested for slap Uddhav remark, Union Minister Narayan Rane detained by Ratnagiri Police, What is the procedure for arresting a Union minister

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి నారాయణ్‌ రాణేను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిర్వహించిన జన ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే మాట్లాడుతూ, ఆగస్టు 15న సీఎం ఉద్దవ్‌ థాకరే తన ప్రసంగం సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరాన్ని మరచిపోయారని, వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందని తన సహాయకులను అడిగారని పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే, అతనికి గట్టిగా చెంపదెబ్బ కొట్టేవాడిని అని నారాయణ్‌ రాణే వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి వ్యాఖలపై తీవ్ర దుమారం చెలరేగింది. మహారాష్ట్రలో పలుప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

కాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ముందుగా శివసేన పార్టీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు నారాయణ్‌ రాణేను అదుపులోకి తీసుకుని ఆయన వ్యాఖ్యలపై విచారిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ లను రద్దు చేయమని బాంబే హైకోర్టులో కేంద్రమంత్రి పిటిషన్‌ దాఖలు చేయగా, అత్యవసర విచారణను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపలేమని, రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం పిటిషన్ ను పరిశీలిస్తామని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =