ఉక్రెయిన్‌ లో భారతీయ విద్యార్థి మృతి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన

Ministry of External Affairs Announces Indian Student Lost His Life in Shelling in Kharkiv Ukraine, Ministry of External Affairs Announces Indian Student Lost His Life in Shelling in Kharkiv, Ministry of External Affairs, Indian Student Lost His Life in Shelling in Kharkiv, Medical Student From Karnataka Killed In Ukraine Confirms Indian Government, Medical Student From Karnataka Killed In Ukraine, Indian Government Confirms That Medical Student From Karnataka Killed In Ukraine, Medical Student From Karnataka, Medical Student, Indian Government, Ukraine, War Crisis, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ సహా రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ లో రష్యా క్షిపణి దాడులు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఖార్కివ్ లో ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న దాడుల్లో భారత విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

“ఈ ఉదయం ఖార్కివ్‌లో జరిగిన షెల్లింగ్‌లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని మేము తీవ్ర విచారంతో ధృవీకరిస్తున్నాము. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతని కుటుంబంతో టచ్‌లో ఉంది. కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. విదేశాంగ కార్యదర్శి రష్యా మరియు ఉక్రెయిన్ రాయబారులతో మాట్లాడి, ఇప్పటికీ ఖార్కివ్‌లో మరియు ఇతర సంఘర్షణ ప్రభావం ఉన్న నగరాల్లో ఉన్న భారతీయ పౌరులను అత్యవసరంగా సురక్షితంగా తరలించే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అలాగే రష్యా మరియు ఉక్రెయిన్‌ లోని భారత రాయబారులు కూడా ఇదే విధమైన చర్యను చేపట్టారు” అని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. కాగా దాడుల్లో మృతి చెందిన విద్యార్థి కర్ణాటక రాష్ట్రానికి చెందిన నవీన్ గా గుర్తించారు. నవీన్‌ ఉక్రెయిన్‌ లో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్టు తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ మంగళవారం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరూ ఈ రోజు అత్యవసరంగా కీవ్ నుండి బయలుదేరాలని సూచించారు. అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా ప్రాధాన్యతగా తీసుకుని కీవ్ నుండి బయటపడాలని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 2 =