రాష్ట్రపతి భవన్‌లో ఆరోగ్యవనాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌, పాల్గొన్న ప్రధాని మోదీ

President Kovind Inaugurates Arogya Vanam at Rashtrapati Bhavan in presence of PM Modi, President Kovind Inaugurates Arogya Vanam at Rashtrapati Bhavan, President Kovind Inaugurates Arogya Vanam, President Kovind, Arogya Vanam at Rashtrapati Bhavan, Arogya Vanam at Rashtrapati Bhavan in presence of PM Modi, Rashtrapati Bhavan, Ram Nath Kovind, President of India, Ram Nath Kovind President of India, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, Arogya Vanam, Arogya Vanam Latest News, Arogya Vanam Latest Updates, Arogya Vanam Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించారు. 6.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆరోగ్య వనం యోగా ముద్రలో కూర్చున్న మనిషి ఆకారంలో అభివృద్ధి చేయబడింది. ఈ ఆరోగ్యవనంలో ఆయుర్వేదంలో చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగించే దాదాపు 215 మూలికలు మరియు మొక్కలు ఉన్నాయి. అలాగే వాటర్ ఫౌంటైన్‌లు, యోగా ప్లాట్‌ఫారమ్, వాటర్ ఛానల్, లోటస్ పాండ్ మరియు వ్యూ పాయింట్ కూడా ఉన్నాయి. ఆయుర్వేద మొక్కల ప్రాముఖ్యత మరియు మానవ శరీరంపై వాటి ప్రభావాలను ప్రచారం చేసే లక్ష్యంతో ఆరోగ్య వనం రూపొందించబడింది. ఈ వనం ఇకపై ప్రజల సందర్శనార్థం తెరవబడనుంది.

ముందుగా మంగళవారం ఉదయం ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఉక్రెయిన్-రష్యా వివాదం, దేశం యొక్క ప్రతిస్పందన, ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు సహా పలు అంశాలపై ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nine =