నేడు తమిళనాడు సీఎం స్టాలిన్‌ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

PM Modi CM KCR and Others Convey Greetings To Tamil Nadu CM MK Stalin on his Birthday, PM Modi Convey Greetings To Tamil Nadu CM MK Stalin on his Birthday, CM KCR Convey Greetings To Tamil Nadu CM MK Stalin on his Birthday, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Tamil Nadu CM MK Stalin, TN CM MK Stalin, MK Stalin, Stalin, Chief Minister of Tamil Nadu, Birthday Greetings, Tamil Nadu Chief Minister MK Stalin, Chief Minister, Mango News, Mango News Telugu,

నేటితో (మంగళవారం) 69 ఏళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, అగ్ర నటుడు రజనీకాంత్ తదితరులు డీఎంకే అధ్యక్షుడిని అభినందించారు. “తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు దీర్ఘాయువు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను” అని ట్విట్టర్ లో తెలిపారు ప్రధాని. అయితే, ప్రధాని మోదీ స్టాలిన్‌తో ఫోన్‌లో కూడా మాట్లాడారని తమిళనాడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. స్టాలిన్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, కలకాలం జీవించాలని.. మరిన్ని విజయాలు సాధించాలని.. సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “ఈరోజు పుట్టినరోజు  జరుపుకుంటున్న కామ్రేడ్ ఎంకే స్టాలిన్‌కు శుభాకాంక్షలు. కేరళ-తమిళనాడు మధ్య సంబంధాలు మరింత బలపడాలని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మహోన్నతమైన సూత్రాల కోసం ఆయన నిరంతరం పోరాడాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్ కూడా తమ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + five =