జాతీయ గోపాల్ రత్న అవార్డులు-2022 ప్రకటించిన కేంద్రం

Ministry of Fisheries Animal Husbandry and Dairying Announces National Gopal Ratna Awards 2022,Ministry of Fisheries,Ministry of Animal Husbandry and Dairying,National Gopal Ratna Awards 2022,Centre Announced Gopal Ratna Awards,Gopal Ratna Awards,Gopal Ratna,Gopal Ratna Awards Latest News And Updates,National Gopal Ratna Awards,National Gopal Ratna Awards 2022,Ministry of Fisheries News And Updates,Central Government,Indian Government News and Latest Updates,PM Modi

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ గోపాల్ రత్న అవార్డులు-2022 ప్రకటించింది. దేశవాళీ పశువులు/గేదె జాతుల పెంపకంలో ఉత్తమ పాడి రైతు, ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు (ఏఐటీ) మరియు బెస్ట్ డైరీ కోఆపరేటివ్/మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ/డైరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కేటగిరిలో కేంద్రం జాతీయ గోపాల్ రత్న అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. గోపాల్ రత్న అవార్డు కింద 1వ ర్యాంక్‌కు రూ.5 లక్షల నగదు బహుమతి, 2వ ర్యాంక్‌కు రూ.3 లక్షలు, 3వ ర్యాంక్‌కు రూ.2 లక్షలు, ప్రతి విభాగంలో మెరిట్ సర్టిఫికెట్ మరియు మెమెంటోను అందజేయనున్నారు. ఈ అవార్డుల కోసం 2022, ఆగస్టు 1 నుండి 2022, అక్టోబర్ 10 వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ అనగా https://awards.gov.in ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 2412 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంలోని పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిల్క్ డే వేడుక 2022లో భాగంగా నవంబర్ 26న బెంగళూరులోని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే కార్యక్రమంలో గోపాల్ రత్న-2022 విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ జంతువులను పెంచే రైతులు, ఏఐ సాంకేతిక నిపుణులు మరియు పాల సహకార సంఘాలు/పాల ఉత్పత్తిదారు కంపెనీ/పాడి రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా జాతీయ గోపాల్ రత్న అవార్డు అనేది పశువుల మరియు పాడి పరిశ్రమ రంగంలో అందిస్తున్న అత్యున్నత జాతీయ అవార్డులలో ఒకటిగా పేర్కొన్నారు.

దేశవాళీ పశువులు/గేదె జాతుల పెంపకంలో ఉత్తమ పాడి రైతు:

  • 1వ ర్యాంక్‌: జితేంద్ర సింగ్, ఫతేహాబాద్, హర్యానా
  • 2వ ర్యాంక్‌: రవిశంకర్ శశికాంత్ సహస్రబుధే, పూణే, మహారాష్ట్ర
  • 3వ ర్యాంక్‌: గోయల్ సోనాల్బెన్ నారన్, కచ్, గుజరాత్

ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు (ఏఐటీ):

  • 1వ ర్యాంక్‌: గోపాల్ రాణా, బలంగీర్, ఒడిశా
  • 2వ ర్యాంక్‌: హరి సింగ్, గంగానగర్, రాజస్థాన్
  • 3వ ర్యాంక్‌: మాచేపల్లి బసవయ్య, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్

బెస్ట్ డైరీ కోఆపరేటివ్/మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ/డైరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్:

  • 1వ ర్యాంక్‌: మనంతవాడి క్షీరోల్పడక సహకార సంగం లిమిటెడ్, వయనాడ్, కేరళ
  • 2వ ర్యాంక్‌: అరకెరె మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మాండ్య, కర్ణాటక
  • 3వ ర్యాంక్‌: మన్నార్గుడి ఎంపీసీఎస్, తిరువారూర్, తమిళనాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =