రేపు పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Governor Tamilisai Soundararajan will Participate in Palamuru University 3rd Convocation Tomorrow,Governor Tamilisai Soundararajan, Palamuru University 3rd convocation,Telangana Governor Tamilisai Soundararajan,Mango News,Mango News Telugu,Governor Soundararajan,Palamuru University,Palamuru University 3rd Convocation Tomorrow,Tamilisai Soundararajan Latest News And Updates,Telangana Governor,Telangana Governor News And Live Updates,Governor Attend Convocation Tomorrow

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు (నవంబర్ 24, గురువారం) పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్.బి లక్ష్మీకాంత్ రాథోడ్ మీడియా సమావేశంలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న 3వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జీ రావు స్నాతకోత్సవ ఉపన్యాసం చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పీహెచ్డీ చేసిన 6 గురికి పీహెచ్డీ పట్టాల ప్రధానంతో పాటు, 73 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 2932 మంది పీజీ , 30645 యూజి విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.

పాలమూరు యూనివర్సిటీ 2008 లో ప్రారంభించగా, అత్యున్నత విద్యా ప్రమాణాలతో ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ముఖ్యంగా దశాబ్ద కాలంలో ఈ యూనివర్సిటీ విద్యారంగంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంస్థగత నిర్మాణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. పాలమూరు యూనివర్సిటీ “న్యాక్ “గుర్తింపు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి మళ్ళీ “న్యాక్” గుర్తింపునకు సిద్ధమవుతున్నట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. యూనివర్సిటీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అభివృద్ధి పనులకు ప్రయత్నాలు చేస్తున్నామని, బోధనతోపాటు, పరిశోధన, సౌకర్యాల కల్పన, సంస్థలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలే కేంద్ర బృందం కూడా యూనివర్సిటీలో పర్యటించి వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో 1800 మంది విద్యార్థులు ఉన్నారని, 18 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి బాలికల హాస్టల్ కూడా ప్రారంభంకానున్నదని వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. అలాగే యూనివర్సిటీలో ఇంజనీరింగ్, లా కళాశాలల ప్రారంభానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగిందని, అంతేకాక ఫిజికల్ ఎడ్యుకేషన్ ను కూడా ప్రతిపాదించామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 14 =