పీడీఆర్డీ గ్రాంట్: 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి ఎంతంటే?

Ministry of Finance Released 7th Monthly Installment Of PDRD Grant of Rs 7183 Cr to 14 States, PDRD Grant of Rs 7183 Cr to 14 States, PDRD Grant, Ministry of Finance, Ministry of Finance Released 7th Installment, Mango News, Mango News Telugu, Post Devolution Revenue Deficit , Post Devolution Revenue Deficit News And Live Updates, Post Devolution Revenue Deficit Grant, PDRD, Rs 7183 Cr to 14 States, Andhra Pradesh News And Live Updates, Ministry of Finance, Union Finance Ministry

కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ శాఖ గురువారం దేశంలోని 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏడో విడతగా 14 రాష్ట్రాలకు 7,183.42 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం పీడీఆర్డీ గ్రాంట్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 14 రాష్ట్రాలకు మొత్తం 86,201 కోట్లు సిఫార్సు చేసింది.

దీంతో ఈ గ్రాంట్‌ని మొత్తం 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు చేయబడిన 14 రాష్ట్రాలకు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా 2022-23లో తాజాగా ఏడో విడత విడుదలతో ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ల మొత్తం రూ.50,282.92 కోట్లుకు చేరిందని చెప్పారు. పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు అందించబడుతుండగా, ఈ 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా విడుదలైన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వివరాలు:

  1. ఆంధ్రప్రదేశ్‌ – రూ.879.08 కోట్లు
  2. అస్సాం – రూ.407.50 కోట్లు
  3. హిమాచల్‌ ప్రదేశ్‌ – రూ.781.42 కోట్లు
  4. కేరళ – రూ.1097.83 కోట్లు
  5. మణిపూర్‌ – రూ.192.50 కోట్లు
  6. మేఘాలయ – రూ.86.08 కోట్లు
  7. మిజోరాం – రూ.134.58 కోట్లు
  8. నాగాలాండ్‌ – రూ.377.50 కోట్లు
  9. పంజాబ్‌ – రూ.689.50 కోట్లు
  10. రాజస్థాన్ – రూ.405.17 కోట్లు
  11. సిక్కిం – రూ.36.67 కోట్లు
  12. పశ్చిమబెంగాల్ – రూ.1132.25 కోట్లు
  13. త్రిపుర – రూ.368.58 కోట్లు
  14. ఉత్తరాఖండ్ -‌ రూ.594.75 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =