అమెరికా వీసాలు @ 10లక్షలు ప్లస్

Mission 1 Million Completed US Embassy Record In India,Mission 1 Million Completed,US Embassy Record In India,1 Million Completed US Embassy,Mango News,Mango News Telugu,US Embassy,Visa,Eric Garcetti,Million Visas,Missiont 1M, US Visas @ 10 Lakhs,Mission 1 Million Completed,US Mission In India,US Processes Record 1 Million,Visa Applications In India, US Embassy Record In India,US Embassy Record Latest News,US Embassy Record Latest Updates,US Embassy Record Live News,US Embassy Latest News,US Embassy Latest Updates

ఇండియాలో బయూఎస్‌ ఎంబసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఇయర్ అన్ని రకాలైన వీసాలను కలిపి ..మిలియన్‌ వీసాలు జారీ చేయాలన్న తమ లక్ష్యాన్ని దాటిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇండియన్లకు జారీ చేసిన వీసాల సంఖ్య 10లక్షలు దాటిపోయింది. దీంతో.. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక సోషల్‌ మీడియా వేదికగా తెలియజేపింది.

మిషన్ 1 మిలియన్ పూర్తయ్యిందని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో తెలిపిన అమెరికా రాయబార కార్యాలయం.. ఇండియాలో ఈ సంవత్సరం వీసాల ప్రక్రియలో తాము పెట్టుకున్న ‘మిలియన్‌ వీసాల జారీ’ లక్ష్యాన్ని దాటేశామని ట్వీట్ చేసింది. అయితే, ఇక్కడితో తాము ఆగిపోబోమని.. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తామని చెప్పుకొచ్చింది. అమెరికాలో పర్యటించడానికి మరింత మంది భారతీయులకు అవకాశాన్ని కల్పిస్తామని అమెరికా ఎంబసీ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా జత చేసింది.

ఆ వీడియోలో మాట్లాడిన భారత్‌కు చెందిన అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ..ఈ సరికొత్త రికార్డుపై హర్షం వ్యక్తం చేశారు. తమ ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన దేశాల్లో భారతదేశం ఒకటి అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బంధం తమదని.. తమ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని ఎరిక్ అన్నారు.తమ ఈ బంధాన్ని ప్రత్యక్షంగా చూడటానికి రాబోయే రోజుల్లో మరింత మంది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను అందజేస్తామని ఎరిక్ గార్సెట్టి చెప్పారు.

2022 సంవత్సరం మొత్తంలో జారీ చేసిన వీసాలను మించి.. ఈ సంవత్సరం ఇప్పటికే వీసాలు జారీ అయ్యాయని అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఇక 2019 నాటితో పోలిస్తే ఇది ఏకంగా 20 పర్సంట్ ఎక్కువని వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా ప్రపంచవ్యాప్తంగా జారీ చేసిన వీసాల్లో ..10 శాతం వీసాలు భారతీయులకే దక్కినట్లు పేర్కొంది. ఇక విద్యార్థి వీసాల్లో 20శాతం, హెచ్‌, ఎల్ కేటగిరీ ఉద్యోగ వీసాల్లో 65 పర్సంట్ వీసాలు భారతీయులకే జారీ అయ్యాయన్న విషయాన్ని గుర్తు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + twelve =