బైబై రూ. 2 వేలు నోటు

Today Is The Last Date For Exchange Of Rs 2000 Note,Today Is The Last Date For Exchange,Exchange Of Rs 2000 Note,Last Date For 2000 Note,Mango News,Mango News Telugu,Bye Buy Rs. 2000 Note, Last Date, Exchange Of Rs.2000 Note,Bankers, Banks, RBI, Shops,2000 Notes Exchange Last Date,Last Date For Exchanging,RBI Clarifies As Last Date,Last Date For 2000 Note Latest News,Exchange Of Rs 2000 Latest Updates,RBI Latest News,Rbi Latest Updates

రూ.2000 నోటు ఈ రోజు నుంచి పూర్తిగా కనుమరుగు కాబోతుంది. కొన్ని నెలల క్రితం పెద్ద నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు.. ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30న దీనికి తుది గడువుగా విధించింది. ఆ తర్వాత ఆ పెద్ద నోటు చెల్లనిదిగా మిగిలిపోతుందని తేల్చి చెప్పేసింది.దీంతో ఇప్పటికే పెద్దనోట్లును పెద్ద సంఖ్యలోనే ప్రజలు బ్యాంకులలో జమ చేసేశారు. కొద్ది రోజులుగా పెద్ద పెద్ద లావాదేవీలు చేస్తున్నప్పుడు రెండు వేల నోట్ల మార్పిడి బాగానే జరిగినట్లు ఆర్థిక నిపుణులు తెలిపారు. అయినా కూడా కొంతమంది మాత్రం రెండువేల నోట్ల మార్పిడి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారని.. అలాంటి వారికి ఈ రోజే లాస్ట్ తేదీ అని .. ఈరోజు ముగిసేలోగా ఆ నోట్లను మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.

పాత రూ. 500, 1000 నోట్ల రద్దు తర్వాత ప్రజలకు వెంటనే అందుబాటులో ఉండటానికి కేంద్రప్రభుత్వం వెంటనే రూ.2000 నోటును చెలామణిలోకి తీసుకువచ్చింది. అయితే ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా ఈ ఏడాది మే 19న గా రూ.2వేల నోటును ఉపసంహరిస్తూ రిజర్వు బ్యాంకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి ఎలాంటి నిబంధనలు లేకుండానే పెద్ద నోట్లను బ్యాంకుల ద్వారా మార్పుకొనే అవకాశం కల్పించింది.

రూ. 2వేల నోటు ఉపసంహరణ తర్వాత ఎక్కువ సమయం ఉండటంతో చిన్న షాపులలో కూడా ఆ నోటును తీసుకోవడానికి భయపడేవారు కాదు కానీ.. తర్వాత మాత్రం రెండు గడువు సమీపించడంతో మద్యం దుకాణాలు, పెట్రోలు బంకులు ఇతర లావాడేవీల్లో ఈ నోట్లు తీసుకోవడానికి సంబంధిత వర్గాలు వెనుకంజ వేయడంతో చాలామంది బ్యాంకుల్లోనే పెద్ద నోట్లను మార్చుకున్నారు.

అయితే బ్యాంకుల్లో మార్పిడికి రూ. 2వేల నోట్లకు విడిగా చలానా ద్వారా లేదా రూ.20వేలు వరకైతే చలానా లేకుండా మార్చుకునే అవకాశం ఇచ్చారు. మరి విదేశాలలో ఉండేవారు తమ స్వస్థలాల్లో దాచుకొన్న నోట్ల విషయంలో గడువు పొడిగిస్తారా? లేదా అనే విషయంలో ఇంకా స్ఫష్టత రాలేదు. మరోవైపు రూ.2వేల నోటు మార్పిడికి రిజర్వు బ్యాంకు సెప్టెంబరు 30 వరకు అంటే ఈ రోజు వరకు మాత్రమే గడువు ఇచ్చిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ గడువుకు పొడిగింపు ఉండకపోవచ్చు. కాబట్టి..ఈ రోజే రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచిస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =