ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అజేయ పోరాటం – రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం

Andhra Pradesh, Chandrababu, chandrababu kuppam tour, Chandrababu Naidu, Chandrababu Naidu Kuppam, Chandrababu Naidu Tour Kuppam District, Chandrababu Naidu visit Kuppam, Chandrababu Tour in Kuppam Constituency, Kuppam, Kuppam constituency, Mango News, TDP Chief Chandrababu Kuppam Tour, TDP Chief Chandrababu Naidu Second Day Visit in Kuppam Tour, TDP Chief Chandrababu Tour in Kuppam Constituency, TDP Chief Chandrababu Tour in Kuppam Constituency From Jan 6 to 8th

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మరో రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (96) అద్భుతమైన ఆటకు తోడు డుసెన్ (40) సమయోచితంగా ఆడడంతో.. భారత్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 7 వికెట్లు మిగిలి ఉండగా అలవోకగా ఛేదించింది. ఈ నెల 11న కేప్‌టౌన్‌లో మూడో టెస్టు ప్రారంభమవుతుంది.

అయితే, 4వ రోజు వర్షం కారణంగా తొలి రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత, ఓవర్‌నైట్ స్కోరు 118/2తో ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 175 పరుగుల వద్ద డుసెన్ వికెట్‌ను కోల్పోయింది. కానీ, కెప్టెన్ ఎల్గర్ సహనంతో ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఎల్గర్ అజేయంగా 96 పరుగులు చేసి సెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తెంబా బవుమా 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీ, శార్దూల్ ఠాకూర్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eight =