అక్కడకు వెళ్తే టైమ్‌ రెండేళ్లు ముందుకు

Mystery Valley In Jharkhand, Mystery Valley, Science,Northern Border,The Time Is Two Years Ahead,Jharkhand, Taimara Valley, Taimara Valley Jharkhand, Jharkhand Tourist Places, Indian Mystery Places, Famous Tourist Places, Mango News, Mango News Telugu
Science,Northern border,Mystery Valley in Jharkhand,the time is two years ahead,Jharkhand

అంతరిక్షానికి కూడా మనిషి వెళ్లి వస్తున్న ఈ రోజుల్లో.. మనిషి కంటే కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దునియాను దున్నేస్తున్న ఈ యుగంలో.. సైన్స్‌కు సవాల్ విసిరే ఎన్నో రహస్యాలు భూమి మీద ఉండి సైంటిస్టులకు సవాల్ విసురుతూనే ఉన్నాయి.  సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ సినిమాల్లో మాత్రమే కనిపించే  మిస్టరీ ల్యాండ్స్‌ కొన్ని.. మన భూమి మీద ఉంటున్నాయి. ఇవి శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తూ మిస్టరీగా మిగిలిపోతున్నాయి.

అవును ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో చాలా  మిస్టరీ ప్రదేశాలున్నాయి. వాటి  గురించి చెప్పే మాటలు,  అక్కడి విశేషాలు కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. జార్ఖండ్‌లోని రాంచీ-జంషెడ్‌పూర్ రహదారి మార్గంలో ఉన్న తైమారా లోయ కూడా ఎప్పుడూ అలాగే అందరినీ ఆశ్యర్యపరుస్తుంది.ఈ మిస్టరీ  ప్రదేశం జార్ఖండ్‌ రాజధాని అయిన  రాంచీకి సుమారు 30 కి.మీటర్ల దూరంలో ఉంది. నాలుగు లేన్ల రహదారికి రెండు వైపులా పర్వతాలు, లోయలు ఉండటం వల్ల..ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలను చక్కగా ఆస్వాదించొచ్చు.

రాంపూర్, తైమారా వ్యాలీ మధ్య ఉన్న ఒక ప్రాంతం చాలా ఏళ్ల నుంచి అందరిని ఆకర్షిస్తోంది. ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు, వారి మొబైల్ ఫోన్‌ డివైజ్‌లో టైమ్‌, ఇయర్‌ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. అవును అక్కడకు వెళ్లాక ఎవరైనా తమ ఫోన్‌ను చెక్‌ చేస్తే, టైమ్ జోన్ ఏకంగా రెండేళ్లు పెరిగి పోతుంది. అంటే మొబైల్‌ ఫోన్‌లో 2023 సంవత్సరం డిసెంబర్ నెల  కాకుండా, 2025 సంవత్సరం డిసెంబర్ నెల కనిపిస్తుంది.

ఇయర్ మాత్రమే కాదు..మొబైల్ ఫోన్ టైమ్‌ను ఈ ప్రాంతంలో చెక్ చేసినా కూడా.. అది కరెక్ట్‌ టైమ్‌‌ను ఎప్పుడూ చూపించదు వేరొక టైమ్‌‌నే చూపిస్తుంది.  విచిత్రంగా మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్‌లో డేట్‌ సెట్టింగ్ మెసేజ్‌ కూడా డిస్‌ప్లే అవ్వడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ విత తప్ప అంతగా చూడటానికి ఏమీ ఉండవు. కాకపోతే కాళీ మాత, బజరంగ్ బలి విగ్రహం ఉన్న మందిరం ఉండటంతో.. కొంతమంది స్థానికులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.

నిజానికి ఆ ప్రాంతంలో ఈ మందిరం కట్టడానికి కూడా ఓ కథ ఉందని స్థానికులు చెబుతారు. తెల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ ఇక్కడ తరచూ రోడ్డు దాటుతున్నట్లు కనిపిస్తుందని.. ఆమెను తప్పించబోయిన ఎన్నో వాహనాలకు ప్రమాదాలు జరిగాయని అంటారు. ఈ ప్రమాదాలు  ఆపడానికే.. ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఈ మందిరాన్ని నిర్మించారట.

తైమారా ఘాట్ రహస్యం ఈ ప్రాంతాన్ని దాటే కర్కాటక రేఖకు సంబంధించిందని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. భూమిని వివిధ వాతావరణ మండలాలుగా డివైడ్ చేయడానికి ఉపయోగించే అక్షాంశాల ఐదు మెయిన్ సర్కిల్స్‌లో  కర్కాటక రేఖ ఒకటి.  భూమధ్యరేఖకు ఉత్తరాన సుమారు 23.5 డిగ్రీల దూరంలో ఉన్న రేఖ..కర్కాటక రేఖ.

ఇది ఉష్ణమండల ఉత్తర బోర్డర్‌ను సూచిస్తుంది. భారత్, మెక్సికో, ఈజిప్ట్, సౌదీ అరేబియా, చైనాతో పాటు చాలా దేశాల గుండా ఈ  కర్కాటక రేఖ వెళుతుంది. కొంతమంది పర్యావరణవేత్తలు కూడా ఈ ప్రాంతంలో ఉన్న భారీ అయస్కాంత క్షేత్రాలు లేదా రేడియేషన్ల వల్లే సమయం మారడం వంటి  అవాంతరాలకు కారణమవుతుందని వివరించారు.

అంతేకాకుండా  తాజాగా మాగ్నటిక్ లక్షణాలను కలిగి ఉన్న చుంకీ తైమారా వ్యాలీ ప్రాంతంలో.. గ్రానైట్ రాయిను శాస్త్రవేత్తలు  కనుగొన్నారు. కాబట్టి, ఏదైనా అయస్కాంత ప్రభావం  వల్ల  క్లాక్ టైమ్ మారుతుండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమయినా  ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని.. అప్పుడే నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని  భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 18 =