యూఐడీఐఏ కీలక నిర్ణయం.. నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్, ఇకపై మరణాలు సైతం నమోదు?

UIDAI Plans To Link Birth and Death Data To Aadhaar and Infants will Get Temporary Number, Newborns To Get Temporary Aadhar Number, UIDAI Plans To Link Birth and Death Data To Aadhaar, Infants will Get Temporary Number, Newborns to get temporary Aadhar as UIDAI plans to link birth, UIDAI plans to link birth, Newborns to get temporary Aadhar, UIDAI To Launch 2 New Pilot Projects, UIDAI plans linking Aadhaar with birth And death From assigning temporary Aadhaar numbers to newborns, temporary Aadhaar numbers to newborns, temporary Aadhaar number, newborns, Mango News, Mango News Telugu,

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఐఏ) ఆధార్ సేవలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇకపై అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్ నంబర్‌ను కేటాయించనున్నది. అలాగే మరణాలను సైతం నమోదు చేయనుంది. దీనికోసం వేర్వేరుగా రెండు పైలెట్‌ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జన్మించిన శిశువులకు వెంటనే తాత్కాలిక ఆధార్ నంబర్‌ను కేటాయించి, ఐదేళ్లు నిండాక శాశ్వత ఆధార్‌ నంబర్‌ను జారీ చేయనున్నది. అలాగే మేజర్‌ అయ్యాక బయోమెట్రిక్‌ సైతం నమోదు చేయనుంది. ఈ మేరకు యూఐడీఐఏ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇక జనన-మరణ డేటాను ఏకీకృతం చేయడం వల్ల సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని నిరోధించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఒక వ్యక్తి యొక్క మొత్తం లైఫ్‌సైకిల్ డేటాను ఆధార్‌కి లింక్ చేయడం వెనుక ఉన్న లక్ష్యం సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు దేశవ్యాప్తంగా దాని విస్తృతిని పెంచడం అని కేంద్రం వాదనగా ఉంది. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్‌ డేటాబేస్‌గా గుర్తింపు పొందిన ‘ఆధార్‌’ను 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. అనంతరం  దేశంలోని ముఖ్యమైన పథకాలకు మరియు దాదాపు అన్ని రకాల సేవలకు ఆధార్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =