స్పామ్ మెయిల్స్‌కు ఈజీగా చెక్ పెట్టొచ్చు..

Web Thumb Gmail, Web Thumb, Mail,Gmail New Feature, Easily Check Spam Mails,Spam Mails,Gmail, Latest Gmail Web Thumb News, Web Thumb News Update, Gamil New Featutes, Spam Mails New Features, Latest Gmail Vesions, Technology, Mango News, Mango News Telugu
Mail ,Gmail new feature, easily check spam mails,spam mails,Gmail

ప్రస్తుతం ఏ చిన్న పని అయినా అఫీషియల్‌గా జరగాలన్న కల్చర్ కార్పొరేట్ కంపెనీలలో ఎక్కువయింది. దీనికితోడు బ్యాంకులు, వివిధ కంపెనీలు తమ కస్టమర్లకు అప్ డేట్స్ అందించడానికి  మెయిల్ సర్వీసులనే ఆశ్రయిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కమ్యూనికేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్స్ వరకు  మెయిల్స్‌ ద్వారానే జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు పనికొచ్చే మెయిల్స్ కంటే కూడా  ఉపయోగం లేని స్పామ్ మెయిల్స్‌ ‌తో  ఇన్‌బాక్స్‌ నిండిపోతుంది.

వీటిని క్లియర్ చేయడం  పెద్ద ప్రాసెస్ అని చాలామంది వీటిని అస్సలు పట్టించుకోరు. దీంతో స్టోరేజ్ నిండిపోయి ఇంపార్టెంట్  మెయిల్స్ కనిపించకుండా పోతాయి. ఇలాంటి ప్రాబ్లెమ్‌కు  చెక్ పెట్టడానికి  జీమెయిల్ కొత్త ఫీచర్‌ను  లాంచ్ చేసింది. ఇప్పుడు సింగిల్ ట్యాప్‌తోనే స్పామ్ ఈ మెయిల్స్ నుంచి సబ్‌స్క్రిప్షన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల యూజర్‌కు  ఈ-మెయిల్‌లో ఎలాంటి  చెత్తా చెదారం లేకుండా కావాల్సిన మెయిల్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

నిజానికి జీమెయిల్ యూజర్లకు స్పామ్ ఈ-మెయిల్స్‌ తొలగింపు అన్నది చాలా పెద్ద పని. ఒక్కటి డిలీట్ చేసేలోగా  మరో 10 స్పామ్ మెయిల్స్ చేరిపోతూ ఉంటాయి. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చు. ఇకపై మార్కెటింగ్ కంపెనీలు లేదా  అన్‌వాంటెడ్ ఈ-మెయిళ్లు వస్తే మాత్రం..సింగిల్ ట్యాప్‌తో వాటి  సబ్‌స్క్రిప్షన్ తీసేయొచ్చు. దీనివల్ల వాటి నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఈ మెయిల్స్ రాకుండా ఆపవచ్చు.

జీమెయిల్ కొత్త ఫీచర్ ద్వారా ఇన్‌బాక్స్‌లో సెండర్ పేరు పక్కన అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను యాడ్ చేసింది. దీనివల్ల అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి..ఆ  ఈ-మెయిల్‌ను తెరవాల్సిన అవసరం లేదు. అలాగే  కింద చిన్న లింక్ కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు.  డైరెక్ట్ బటన్‌ను నొక్కితే చాలు,ఆ యూజర్లను మెయిలింగ్ లిస్ట్‌ నుంచి తీసివేయమని సెండర్స్‌కు జీమెయిల్ రిక్వెస్ట్ పంపుతుంది.

ఈ స్పెసిఫికేషన్ స్పామ్ ఈ మెయిల్‌ల నుంచి ఈజీగా అన్‌సబ్‌స్క్రయిబ్ అయిపోవచ్చు. ఇందుకుముందు, ఈ-మెయిల్‌ను ఓపెన్ చేసి, కింద ఉన్న అన్‌సబ్‌స్క్రయిబ్ లింక్‌ని వెతిక్కోవాల్సి వచ్చేది. ఒక్కోసారి ఈ అన్‌సబ్‌స్క్రయిబ్ ఆప్షన్ హైడ్‌లో ఉండేది. లేదంటే త్రీ డాట్స్ మెనూ ఓపెన్ చేశాక..అప్పుడు అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ రెండు పద్ధతులు చాలా టైమ్ వేస్ట్ చేసేవి.

కొత్త ఫీచర్ ప్రస్తుతం జీమెయిల్ ఐఓఎస్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది  త్రరలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోంది. జీ మెయిల్‌ను  అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు  ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో తెలియదు. జీ మెయిల్ డెస్క్‌టాప్ యూజర్లకు కూడా ఇలాంటి స్ఫెసిఫికేషన్‌ను  అందిస్తోంది. ఈ-మెయిల్‌లో అన్‌సబ్‌స్క్రైబ్ లింక్‌ను జీ మెయిల్ గుర్తిస్తే, ఆటోమేటిక్‌గా మెసేజ్‌కు అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను యాడ్ చేసేస్తుంది. సెండర్ నుంచి ఈ మెయిల్స్‌ను రాకుండా ఆపేయడానికి దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 2 =