సీఎం కెసిఆర్ పై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి

breaking news, CM KCR, Congress, Congress Latest News, Kodangal, Mango News, Revanth Reddy, Revanth Reddy Sensational Comments On CM KCR, Revanth Reddy Speech At Kodangal, Revanth Reddy Visits Kodangal, Telangana Latest News, Telangana News, telugu breaking news, telugu latest news, TPCC President Revanth Reddy, TPCC President Revanth Reddy Sensational Comments On CM KCR, TPCC President Revanth Reddy Sensational Comments On CM KCR At Kodangal, TS Live News

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం కొడంగల్ నియోజకవర్గం కోస్గి వచ్చిన ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సోనియాగాంధీకి, రాజీవ్ గాంధీకి మాట ఇచ్చామని.. ఒక్క కొడంగల్ నుంచే లక్ష డిజిటల్ మెంబర్ షిప్ నమోదు చేయించాలని స్థానిక నేతలకు సూచించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కార్యకర్తలందరు కృషిచేయాలని చెప్పారు.

కెసిఆర్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఒక్క ఇల్లు అయినా కట్టించి ఇవ్వగలిగాడా అని రేవంత్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు కేటాయించిన ఇళ్లనే ఇప్పుడు కెసిఆర్ ఇస్తున్నారని, కొత్తగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించలేదని అన్నారు. దళితులకు గాని, గిరిజనులకు గాని, బీసీలకు గాని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి పెరిగిపోయిందని అయన అన్నారు. కెసిఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చాక పాలన పూర్తిగా గాడితప్పిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here