ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్‌!

NIA Received E-mail Threatening to Assassinate PM Modi NIA to Investigate Issue, NIA Received E-mail Threatening to Assassinate PM Modi, NIA to Investigate Issue, Assassinate PM Modi, NIA, NIA Latest News, NIA Latest Updates, National Investigation Agency, National Investigation Agency Received E-mail Threatening to Assassinate PM Modi, PM Modi, Assassination Of PM Modi, NIA Received E-mail Threatening to Assassination Of PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ముంబయిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కార్యాలయానికి ఓ ఆగంతకుడు బెదిరింపు ఈ-మెయిల్ పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి. తన వద్ద 20 కిలోల ఆర్‌డిఎక్స్ ఉందని, దేశంలో వేలాది మందిని చంపేందుకు కుట్ర చేస్తునట్టు పంపిన వ్యక్తి ఈ-మెయిల్‌ లో పేర్కొన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా 20 దాడులకు ప్లాన్ చేస్తున్నానని, అలాగే ఈ పని చేయగల వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నానని మరియు ఈ దేశానికి పెను విషాదాన్ని సృష్టిస్తానని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 28న స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేసానని, ఈ ప్లాన్‌తో వివిధ ఉగ్రవాద సంస్థలకు కూడా సంబంధం ఉందని ఆ వ్యక్తి మెయిల్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్ ఈ-మెయిల్‌ ను ఇతర ఏజెన్సీలతో కూడా పంచుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. అధికారులు ఈ ఈ-మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here