ఎలక్ట్రిక్ వాహ‌నాల ప్ర‌మాదాల‌పై నితిన్ గ‌డ్క‌రీ సీరియస్, నిర్లక్ష్యం వహించే కంపెనీలకు భారీ జరిమానా

Nitin Gadkari Calls for Advance Ation by Companies to Recall All Defective Batches of Electric Vehicles, Nitin Gadkari said companies may take advance action to Recall all defective batches of vehicles immediately, Recall All Defective Batches of Electric Vehicles, Nitin Gadkari Calls for Recall All Defective Batches of Electric Vehicles, Nitin Gadkari, Nitin Gadkari Minister of Road Transport and Highways of India, Nitin Gadkari Minister of Road Transport, Nitin Gadkari Minister of Highways of India, All Defective Batches of Electric Vehicles, Electric Vehicles Defective Batches , Electric Vehicles News, Electric Vehicles Latest News, Electric Vehicles Latest Updates, Electric Vehicles Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో ఇటీవల పలు చోట్ల ఎల‌క్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడం, వాహనాల బ్యాటరీలు పేలడంతో ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. లోపలున్న అన్ని బ్యాచ్ ల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేయడానికి ముందస్తు చర్య తీసుకోవాలని కంపెనీలను నితిన్ గడ్కరీ సూచించారు. అలాగే ఎల‌క్ట్రిక్ వాహనాల సంఘటనలపై విచారణ మరియు నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు వరుస ట్వీట్లు చేస్తూ, గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక దుర్ఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడడం అత్యంత దురదృష్టకరమన్నారు. అన్ని లోపభూయిష్ట వాహనాల బ్యాచ్‌లను వెంటనే రీకాల్ చేయడానికి కంపెనీలు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తీ ప్ర‌యాణికుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు కట్టుబడి ఉంద‌ని ఆయ‌న అన్నారు.

కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా:

ఈ ఘటనలపై విచారణ జరిపి పరిష్కార చర్యలపై సిఫార్సులు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. నివేదికల ఆధారంగా డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని, ఎలక్ట్రిక్ వాహనాలకు నాణ్యత ఆధారిత మార్గదర్శకాలను కూడా త్వరలో జారీ చేస్తామని చెప్పారు. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధించబడుతుందని మరియు అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశించబడుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 10 =