బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది : సీఎస్

Telangana CS Somesh Kumar Held a Meeting with Ayush Doctors over Black Fungus,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar,CS Somesh Kumar News,CS Somesh Kumar Latest news,CS Somesh Kumar Pressmeet,CS Somesh Kumar Pressmeet Live,CS Somesh Kumar Speech,CS Somesh Kumar Live updates,CS Somesh Kumar Live Update,CS Somesh Kumar Held a Meeting,CS Somesh Kumar Meeting,CS Somesh Kumar Held a Meeting with Ayush Doctors,Ayush Doctors,Black Fungus,Black Fungus Virus,CS Somesh Kumar over Black Fungus,CS Somesh Kumar Meeting with Ayush Doctors,Telangana CS holds meeting to tackle Black Fungus

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని సీఎస్ అన్నారు. ఈ వ్యాధికి గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ ఇ.ఎన్.టి. ఆసుపత్రి-కింగ్ కోఠిలలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఆయుర్వేద, హోమియోపతి మరియు యునాని వైద్య పద్ధతులలో లభించే చికిత్స విధానాలను గురించి ఆయుష్ వైద్యులు సీఎస్ కి ఈ సందర్భంగా వివరించారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రులలో చికిత్స అందించబడతుందని సీఎస్ కి తెలిపారు. ఆయుష్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు మరియు ప్రెస్ బ్రీఫింగ్‌ల ద్వారా పేషంట్లకు అవగాహన కల్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులకు సూచించారు.

ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, తెలంగాణ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ ఎం.జ్యోతి, ఆయుష్ విభాగం డైరెక్టర్ డా.అలగు వర్షిణి, ఆరోగ్య శాఖ సాంకేతిక సలహాదారు డా.గంగాధర్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, హోమియోపతి డాక్టర్లు డా.లింగా రాజు, డా.పి.నవీన్, ప్రొఫెసర్ కె.రజని చందర్, ప్రొఫెసర్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్లు డా.సురేష్ జఖోటియా, డా.ప్రవీణ్ కుమార్, డా.శైలేష్ నాథ్ సక్సేనా, యునాని డాక్టర్లు ప్రొఫెసర్ బొఖారీ, ప్రొఫెసర్ సలావుద్దీన్, డా.ఎం.హెచ్. కజ్మి, డా.మిన్హాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =