కాబుల్‌ లో భారత ఎంబసీ మూసివేత, అధికారులు, సిబ్బంది భారత్ కు తరలింపు

Afghanistan Crisis, Contingency plan in place to evacuate Indian officials, IAF plane from Afghanistan lands at Jamnagar airbase, IAF Plane Lands in Afghanistan’s Kabul, IAF to airlift stranded Indian nationals, India evacuates embassy staff, India Evacuates Kabul Embassy, India Evacuates Kabul Embassy Officers and Staff Shifted to India in IAF Plane, India safely evacuates diplomats citizens from Afghanistan, India’s new contacts with Taliban aid evacuation of Kabul, Mango News, Officers and Staff Shifted to India in IAF Plane

తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ లో ఏర్పడ్డ ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా భారత్ కాబూల్ లోని రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కాబూల్ లోని భారత రాయబారి సహా 130 మందికి పైగా ఎంబసీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు, ఇతర సంబంధిత అధికారులను సి-17 ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానం ద్వారా భారత్ కు తరలించారు. కాబూల్ నుండి బయలుదేరిన ఐఏఎఫ్ విమానం మంగళవారం ఉదయం 11:30 గంటలకు జామ్‌నగర్‌ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి చేరనుందని అధికారులు తెలిపారు.

ఆఫ్ఘానిస్తాన్ నుంచి భారతీయ సిబ్బంది తరలింపులో భాగంగా ఇప్పటికి రెండు విమానాలు దేశానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సోమవారం నాడు కాబుల్ లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిపివేయడానికి ముందే మరొక సీ-17 విమానం కాబూల్ నుండి భారత ఎంబసీ సిబ్బంది సహా దాదాపు 40 మందిని దేశానికి తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ కు రావాలనుకునే ఆఫ్ఘానిస్తాన్ ప్రజల దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ-ఎమర్జెన్సీ (e-Emergency X-Misc Visa) అనే కొత్త కేటగిరీ వీసాలను కూడా ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =