రసాయనశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు వీరే…

Benjamin List, Benjamin List and David MacMillan win 2021 Nobel Prize, David MacMillan, David MacMillan win 2021 Nobel Prize, Germany’s Benjamin List American David MacMillan win Nobel Prize, Mango News, Nobel chemistry prize goes to duo who developed a tool, Nobel Prize 2021 For Chemistry, Nobel Prize 2021 For Chemistry Winners Are Benjamin List And David MacMillan, Nobel Prize 2021 in Chemistry awarded to Benjamin List, Nobel Prize For Chemistry, Nobel Prize in Chemistry, Nobel Prize in Chemistry 2021

రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు 2021 సంవత్సరానికి గాను ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి లభించింది. అసిమ్మెట్రీక్ ఆర్గానోకాటాలిసిస్ అభివృద్ధి చేసినందుకు బెంజమిన్ లిస్ట్ మరియు డేవిడ్ డబ్ల్యూ.సీ.మాక్ మిలన్ అనే శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారాన్ని అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.

అలాగే భౌతిక శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన ముగ్గురు పరిశోధకులకు మంగళవారం నాడు నోబెల్‌ బహుమతి ప్రకటించారు. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల గురించి అవగాహన కోసం అద్భుత రచనలు అందించినందుకుగాను స్యూకురో మనాబే, క్లాస్ హస్సెల్మాన్ మరియు జార్జియో ప్యారిసీలకు ఈ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. ఇందులో జార్జియో ప్యారిసీకి సగం పురస్కారాన్ని ప్రకటించగా, మిగతా సగాన్ని స్యూకురో మనాబే, క్లాస్ హస్సెల్మాన్ సంయుక్తంగా పంచుకోనున్నట్టు తెలిపారు.

మరోవైపు సోమవారం నాడు వైద్య శాస్త్రంలో ఉష్ణోగ్రత మరియు స్పర్శ కోసం గ్రాహకాల ఆవిష్కరణలకై జరిపిన పరిశోధనలకు గానూ అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌ లకు సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఇక సాహిత్యం, శాంతి, అర్ధశాస్త్రంలకు సంబంధించి వరుసగా‌ నోబెల్ బహుమతిలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =