ఉత్తర కొరియాలో మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదు, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశించిన అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్

North Korea Claims First Ever Covid Case President Kim Jong Orders Nationwide Lockdown, President Kim Jong Orders Nationwide Lockdown, North Korea Claims First Ever Covid Case, Nationwide Lockdown, President Kim Jong, North Korea Nationwide Lockdown, North Korea Nationwide Lockdown News, North Korea Nationwide Lockdown Latest News, North Korea Nationwide Lockdown Latest Updates, North Korea Nationwide Lockdown Live Updates, North Korea First Covid Case, North Korea Covid-19 Updates, North Korea Covid-19 Live Updates, North Korea Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, North Korea Coronavirus, North Korea Coronavirus Cases, North Korea Coronavirus New Cases, North Korea Coronavirus News, North Korea New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, North Korea, Mango News, Mango News Telugu,

గడచిన రెండుళ్లుగా ప్రపంచం మొత్తాన్ని ఒణికిస్తున్న కరోనా వైరస్ ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకు అడుగుపెట్టలేకపోయింది. అయితే తాజాగా.. మొట్టమొదటి కోవిడ్ కేసును ఉత్తర కొరియా గురువారం ధృవీకరించింది. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఆఘమేఘాలపై స్పందించి దేశవ్యాప్తంగా ‘తీవ్రమైన అత్యవసర పరిస్థితి’ ప్రకటించడంతో పాటు కంప్లీట్ లాక్‌డౌన్‌కు ఆదేశించారు. 2020 లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఉత్తర కొరియా ప్రభుత్వం దేశ సరిహద్దుల వద్ద కఠినమైన దిగ్బంధనాన్ని విధించింది. మిగిలిన దేశాలతో రాకపోకలను నిషేధించడంతో పాటు, కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇంత చేసినా ఆ దేశం కరోనాను తమ దేశంలోకి అడుగు పెట్టకుండా నిరోధించలేకపోయింది.

తాజాగా ప్యోంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నుండి తీసుకోబడిన నమూనాలలో ‘ఒమిక్రాన్ BA.2 వేరియంట్‌’ కనుగొనబడింది అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ గురువారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘గరిష్ట అత్యవసర అంటువ్యాధి నివారణ వ్యవస్థ’ ను అమలు చేయాలని కిమ్ ఆదేశించారు. దేశంలోని అన్ని నగరాలు మరియు కౌంటీలు తమ ప్రాంతాలను పూర్తిగా లాక్‌డౌన్‌ చేయమని సూచించారు. ‘ఉత్తర కొరియా ప్రస్తుత ఆకస్మిక పరిస్థితిని అధిగమిస్తుంది మరియు అత్యవసర అంటువ్యాధి నివారణ పనిలో విజయం సాధిస్తుందని’ కిమ్ సమావేశంలో చెప్పారని అధికారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాకు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eleven =