ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ఒమిక్రాన్ గండం

Coronavirus, Covid B.1.1.529 variant, COVID-19, covid-19 new variant, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron spreads faster and weakens jabs, Omicron variant, omicron variant in India, Omicron Variant Is Spreading Very Fastly, Omicron Variant Is Spreading Very Fastly Around, Omicron Variant Is Spreading Very Fastly Around The World, omicron variant south africa, Update on Omicron

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ పుట్టింది దక్షిణాఫ్రికా లోనే అయినా.. ఇప్పుడు తన ప్రభావాన్ని అన్ని దేశాలలో చూపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ శనివారం ఒక్కరోజే 600 కేసులు బయటపడ్డాయి. వచ్చే 4 వారాల్లో బయటపడే కేసుల్లో సగం కేసులు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులే ఉండొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. గత 2 వారాల్లో అక్కడ నమోదయిన కేసుల ఆధారంగా వారు ఈ అంచనాకు వస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే డిసెంబర్ నెల చివరికి 10 లక్షల కేసులు రావచ్చని వారు అంచనా వేస్తున్నారు.

కఠిన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే 2022 ఏప్రిల్ నాటికి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన వ్యక్తి మరణించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల్లో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

భారత దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య ఎక్కువగా లేకపోయినప్పటికీ ఏ క్షణమైనా ఇది విరుచుకు పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 38 కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర లో పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంక్షలను కొంచెం కఠినతరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకింది. అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 2 =