కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ

Kashi Vishwanath Corridor Inauguration, Kashi Vishwanath Corridor Inauguration Live Updates, Kashi Vishwanath corridor set to be inaugurated, Mango News, MangoNews, PM Inaugurates First Phase Of Kashi Vishwanath Corridor Project, PM Modi, PM Modi Inaugurates Kashi Vishwanath Corridor, PM Modi Inaugurates Kashi Vishwanath Corridor And Other Projects, PM Modi Inaugurates Kashi Vishwanath Corridor And Other Projects In Holy City Varanasi, PM Modi inaugurates Kashi Vishwanath Dham in Varanasi, PM Modi to inaugurate Kashi Vishwanath Corridor today, PM Narendra Modi in Varanasi LIVE Updates, varanasi

కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత సనాతన ధర్మానికి ప్రతిరూపమని భారత ప్రధాని మోదీ నిర్వచించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సుమారు రూ. 340 కోట్లతో కారిడార్ మొదటిదశ పనులు ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

“కాశీ విశ్వనాధుడికి నమస్కరిస్తున్నా. అందరికి విశ్వనాధుడి ఆశీస్సులు ఉంటాయి. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరుగదు. కాశీలో మృత్యువు కూడా మంగళ కరమే. కాశీలో ప్రతి ఒక్కరిలో ఆ విశ్వనాథుడే కనపడతాడు. ఇక్కడినుంచి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. ఎవరైనా కాశీలో అడుగు పెట్టగానే అంతరాత్మ మేలుకుంటుంది. అన్ని బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజు మనం ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమయింది. కాశీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రచించాం.”

“కాశీ విశ్వనాథ్ కారిడార్ మన భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక. దీంతో పవిత్ర గంగానది ప్రసన్నమైనది. దురాక్రమణదారులు ఎంతోమంది ఈ పవిత్ర స్థలంపై దాడికి ప్రయత్నించారు. కత్తులతో ఇక్కడి పవిత్ర సంస్కృతి, సంప్రదాయాలను చంపేందుకు ప్రయత్నించారు. ఇక్కడి భూమి మిగతావాటికన్నా భిన్నమైనది. ఇక్కడ మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబు వస్తే, మరాఠా యోధుడు శివాజీ కూడా అవతరించాడు. ఈ కారిడార్ నిర్మాణం కోసం రాత్రిబవళ్ళు కష్టపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా” అని ప్రధాని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 1 =