ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీ, బీజేపీ ప్రకటనపై విమర్శలు

2020 Bihar Legislative Assembly election, Bihar Assembly Elections, Bihar Assembly Elections 2020, Bihar Assembly Elections 2020 LIVE Updates, Bihar Assembly Elections Updates, Bihar Elections 2020, BJP Releases Party Manifesto In Bihar, Free Corona Vaccine Distribution Promise in Bihar, Opposition Parties Slams BJP

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ హామీల్లో ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ఉచిత పంపిణీపై ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తయి, పెద్ద స్థాయిలో ఉత్పత్తి మొదలవగానే బీహార్‌ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని వెల్లడించారు.

అయితే బీజేపీ హామీపై దేశంలో ప్రతిపక్షాలు, ఇతర వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం ఎదుర్కొంటున్న మహమ్మారి అంశాన్ని, రాజకీయ అజెండాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. “కేంద్రప్రభుత్వం ఇప్పుడే భారతదేశం యొక్క కోవిడ్ పంపిణీ వ్యూహాన్ని ప్రకటించింది. మీరు ఎప్పుడు పొందుతారో తెలుసుకోవడానికి దయచేసి రాష్ట్రాల వారీగా ఎన్నికల షెడ్యూల్‌ను చూడండి” అని రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ లేని చోటా భారతీయులకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉచితంగా లభించదా అని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కూడా ఈ అంశంపై విమర్శలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =