గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పేటీఎం యాప్‌ తొలగింపు

Google Play Store, Google takes down Paytm from Play Store, paytm, Paytm App, Paytm App Pulled From Google Play Store, Paytm app removed from Google Play Store, Paytm pulled from Google Play Store, paytm removed from play store

దేశంలో ఎక్కువుగా వాడుకలో ఉన్న డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం యొక్క యాప్ ను శుక్రవారం నాడు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. అలాగే పేటీఎం యాప్ తో పాటుగా పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. ఆన్‌లైన్ గ్లాంబ్లింగ్, నగదు బహుమతులతో పోటీలు నిర్వహణకు సంబంధించి గూగుల్ కాంప్లెక్స్ నియమాలను ఉల్లంఘించినందు వలనే పేటీఎంపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. పేటీఎం తొలగింపులో ఎలాంటి భద్రతా కారణాలు, సమస్యలు లేవని పేర్కొన్నారు. అయితే వన్97 కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఉన్న పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి.

గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ ను తొలగించడంపై పేటీఎం అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పందించింది. “పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ క్రొత్త డౌన్‌లోడ్‌లు లేదా అప్ డేట్ ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌ లో తాత్కాలికంగా అందుబాటులో లేదు. యాప్ త్వరలోనే ప్లే స్టోర్ లోకి తిరిగి వస్తుంది. మీ డబ్బు అంతా పూర్తిగా సురక్షితం, మరియు మీరు మీ పేటీఎం యాప్ ను మామూలుగా ఉపయోగించుకోవడం కొనసాగించవచ్చు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =