భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

PM Modi Bangladesh PM Sheikh Hasina Jointly Inaugurated the India-Bangladesh Friendship Pipeline,PM Modi India-Bangladesh Friendship Pipeline,Bangladesh PM Sheikh Hasina Jointly Inaugurated,India-Bangladesh Friendship Pipeline,Mango News,Mango News Telugu,PM Modi Sheikh Hasina jointly inaugurate India,PM Modi Live,PM and Bangladesh PM Sheikh Hasina,PM Modi and Sheikh Hasina Launch 125KM Long Pipeline,Indian Prime Minister Narendra Modi,Bangladesh PM Sheikh Hasina,Narendra modi Latest News and Updates,National Politics, Indian Politics, Indian Political News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంయుక్తంగా భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ (ఐబీఎఫ్పి)ని ఈరోజు (మార్చి 18, శనివారం) వర్చువల్ మోడ్‌లో ప్రారంభించారు. ఈ పైప్‌లైన్ నిర్మాణానికి 2018 సెప్టెంబర్‌లో ప్రధానమంత్రులిద్దరూ పునాది రాయి వేశారు. నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ 2015 నుండి బంగ్లాదేశ్‌కు పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. భారతదేశం మరియు దాని పొరుగు దేశాల మధ్య ఇది రెండవ క్రాస్-బోర్డర్ ఎనర్జీ పైప్‌లైన్ గా నిలిచింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

విద్యుత్ మరియు ఇంధన రంగంలో సహకారం భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఒకటిగా మారిందని తెలిపారు. ఐబీఎఫ్పి అనేది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య మొదటి క్రాస్ బోర్డర్ ఎనర్జీ పైప్‌లైన్ కాగా, ఇది బంగ్లాదేశ్‌కు 1 మిలియన్ మెట్రిక్ టన్ను హై-స్పీడ్ డీజిల్ (హెఛ్ఎస్డీ)ని రవాణా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. బంగ్లాదేశ్‌తో మెరుగైన కనెక్టివిటీ ఇరువైపులా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపడేలా చేస్తుందన్నారు. బంగ్లాదేశ్ భారతదేశం యొక్క అత్యంత అభివృద్ధి భాగస్వామి మరియు ఈ ప్రాంతంలో దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని పేర్కొన్నారు. ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ యొక్క కార్యాచరణ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఇంధన సహకారాన్ని మెరుగుపరుస్తుందని మరియు బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా వ్యవసాయ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై నిరంతరం మార్గనిర్దేశం చేసినందుకు బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు మరియు రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం బంగ్లా ప్రధానితో కలిసి పని చేయడం కొనసాగించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =