విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నేడే రెండో వన్డే.. కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ రాక, సిరీస్‌పై కన్నేసిన భారత్

Ind vs Aus 2nd ODI India Aim To Seal The Series at Vizag as Regular Captain Rohit Sharma Return to Captaincy Duties,Ind vs Aus 2nd ODI India,2nd ODI Series at Vizag,Regular Captain Rohit Sharma,Rohit Sharma Return to Captaincy Duties,Mango News,Mango News Telugu,IND VS AUS Live Updates,2nd ODI Cricket Match Live Score,IND vs AUS Weather Report Live Today,Second ODI Between India and Australia,India vs Australia 2nd ODI Live Score,IND vs AUS 1st ODI Preview,Vizag Stadium Live Updates,India vs Australia Latest News and Updates,India vs Australia Live News

తొలివన్డేలో అద్భుత విజయం సాధించిన తర్వాత టీమిండియా ఆదివారం విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక వాంఖడే స్టేడియంలో జరిగిన తక్కువ స్కోరింగ్ గేమ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే. ఇక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఫామ్‌ను కోల్పోయి ఇబ్బంది పడిన లోకేష్ రాహుల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు మోకాలి గాయం, శస్త్రచికిత్స కారణంగా దాదాపు ఎనిమిది నెలల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్న జడేజా, తొలి వన్డేలో రెండు వికెట్లు తీయడంతో పాటు అజేయంగా 45 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

కాగా వ్యక్తిగత కారణాలతో ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో కలిసాడు. దీంతో భారత్ టాప్ ఆర్డర్‌ మరింత బలోపేతమైంది. దీంతో నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఇక మొదటి వన్డేలో రోహిత్ శర్మ స్థానంలో ఆడిన ఇషాన్ కిష‌న్‌ నేటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అయితే తొలి వన్డేలో స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ విఫలమవడం భారత్ జట్టును ఆందోళన కలిగిస్తోంది. రెండో వన్డేలో వారు చెలరేగాలని జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 9 వన్డే మ్యాచ్‌లు జరుగగా టీమిండియా 7 గెలుచుకుంది. ఒకదానిలో ఓటమి పాలవగా.. ఇంకో మ్యాచ్ టై అయింది.

ఇక పేస్‌కు అనుకూలమైన వాంఖడే పిచ్‌పై పేసర్లు మహ్మద్ షమీ మరియు మహ్మద్ సిరాజ్ విజృంభించడంతో భారత బౌలింగ్ ముంబైలో ఆస్ట్రేలియాను వణికించింది. అలాగే రవీంద్ర జడేజా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే కుల్దీప్ యాదవ్ అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇదిలా ఉండగా మరోవైపు తొలి మ్యాచ్‌లో ఎదురైనా దారుణ పరాభవానికి ఆస్ట్రేలియా నేటి మ్యాచ్ ద్వారా బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. తద్వారా సిరీస్ అసలు కూడా సజీవంగా ఉంచుకోవాలని ఆరాటపడుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్లు అంచనా..

భారత్: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (సి), మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here