పీఎం నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

Modi Chairs Union Cabinet Meeting at 7 Lok Kalyan Marg, national news, PM Modi chairs Union Cabinet meeting, PM Modi Union Cabinet Meeting, Prime Minister Narendra Modi, Union Cabinet Meeting, Union Cabinet Meeting at 7 Lok Kalyan Marg, Union Cabinet Meeting Today

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 8, బుధవారం ఉదయం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలు శాఖల మంత్రులు హాజరయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, పెరుగుతున్న పాజిటివ్ కేసులు, కరోనా నియంత్రణ చర్యలు, చైనాతో సరిహద్దు వివాదం, తాజా ఆర్థిక పరిస్థితులు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ తదితర అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here