అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు ఆదేశాలు, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి

Andhra Pradesh High Court, AP High Court, Atchannaidu, Atchannaidu Latest News, Atchannaidu Remand, Atchannaidu to Private Hospital, Former minister Atchannaidu, TDP Leader Atchannaidu

ఈఎస్‌ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును జీజీహెచ్ ‌నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక, ఏసీబీ అధికారులు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ముందుగా తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించే విధంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును పెండింగ్ లో ఉంచింది.

కాగా అచ్చెన్నాయుడును విజయవాడ లేదా గుంటూరు నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించే విషయంపై ఈ రోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు అనంతరం గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి అచ్చెన్నాయుడును తరలించేందుకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును ఈ రోజు మళ్ళీ ఆసుపత్రికి తరలించే అవకాశమునట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here