రోహిత్‌, కోహ్లీతోపాటు ఎవరికీ మినహాయింపు లేదు..

Asia Cup 2023 Indian Cricketers Including Rohit Sharma and Virat Kohli Will Attend For Fitness Test at Bangalore,Asia Cup 2023 Indian Cricketers,Indian Cricketers Including Rohit Sharma,Rohit Sharma and Virat Kohli Will Attend,Fitness Test at Bangalore,Mango News,Mango News Telugu,Team Indias, the Asia Cup, Sri Lanka, The Indian team, BCCI ,NCA in Bengaluru,Virat Kohli, Rohit Sharma, Hardik Pandya, Ravindra Jadeja, Mohammed Shami, Mohammed Siraj, Asia Cup 2023 Latest News,Asia Cup 2023 Latest Updates,Asia Cup 2023 Live News

ఆసియా కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు శ్రీలంకలో జరగనున్నాయి. దీని కోసం భారత జట్టు అక్కడకు వెళ్లాల్సి ఉంది. దానికి ముందు ఆటగాళ్లందరికీ బెంగళూరులోని ఎన్‌సీఏలో ఐదు రోజుల ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్యాంప్‌లో ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌లు అందుకోని వారిని గుర్తించాలని బీసీసీఐ అనుకుంటోందట.

వెస్టిండీస్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న టీమిండియా ప్లేయర్ల కోసం 13 రోజుల ప్రోగ్రాంను ఎన్‌సీఏ ట్రైనర్లు సిద్ధం చేశారట. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ తదితరులంతా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారని సమాచారం. ‘వచ్చే రెండు నెలల్లో ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉండటం ముఖ్యం. అందుకే ఈ స్పెషల్ ప్రోగ్రాం రెడీ చేశాం. ఈ ప్రోగ్రాం ఫాలో అయిన వాళ్లెవరు..? అవలేకపోయిన వాళ్లెవరు..? అనే వివరాలు ట్రైనర్‌కు తెలుస్తుంది. దీన్ని అనుసరించలేకపోయిన వాళ్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని ఆ తర్వాత టీం మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది’ అని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు.

ఆగస్టు 9 నుంచి 22 వరకు రెండు దశల్లో ఈ ఫిట్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారట. స్ట్రెంత్, మొబిలిటీ, షోల్డర్ కేర్, గ్లూట్ మజిల్స్ తదితర అంశాలపై ఈ ప్రోగ్రాం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీనికోసం ప్లేయర్లకు ప్రొటీన్ డైట్ ఇవ్వడంతోపాటు జిమ్ సెషన్లు, యోగా, మసాజ్, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ తదితర ఎక్సర్‌సైజులు చేయించారట. ప్రతి ప్లేయర్‌ చేత కొన్ని టెక్నికల్ డ్రిల్స్ చేయించి, వాళ్లు కనీసం 9 గంటలు నిద్రపోయేలా ఏర్పాట్లు చేశారట ట్రైనర్లు. రాహుల్, శ్రేయాస్ అయ్యర్, బుమ్రా తదితర ప్లేయర్లు గాయాలపాలు అవడంతో టీమిండియా ఎంత ఇబ్బంది పడిందో వేరే చెప్పక్కర్లేదు. దీంతోనే ఇప్పుడు వరల్డ్ కప్ ముందు ఎక్కువ ఛాన్సులు తీసుకోకూడదని బీసీసీఐ అనుకుంటోందట.

అందుకే ఆటగాళ్లకు ఇలా ట్రైనింగ్ సెషన్ నిర్వహించింది. ఇప్పుడు బెంగళూరులో ఈ ప్లేయర్లకు ఐదు రోజుల క్యాంప్ నిర్వహిస్తారు. ఈ క్యాంప్‌లో వీళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు. కోహ్లీ, రోహిత్ తదితర సీనియర్లు కూడా తమ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం వీళ్లిద్దరూ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు కూడా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here