ఫరీదాబాద్‌లో రూ.6000 కోట్లతో నిర్మిస్తున్న అమృత ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Amrita Hospital in Faridabad Homi Bhabha Cancer Hospital and Research Centre in Mohali Today, PM Modi Inaugurates Homi Bhabha Cancer Hospital and Research Centre in Mohali Today, PM Modi Inaugurates Amrita Hospital in Faridabad Today, Amrita Hospital, Homi Bhabha Cancer Hospital and Research Centre, PM Modi Latest News And Updates, PM Modi Live Updates, Amrita Hospital In Faridabad , Mata Amritanandamayi Hospital, Faridabad Health Infrastructure, Indian Health Ministry, Health Care In India, Amrita Hospital Faridabad, PM Modi Punjab And Haryana Visit, PM Narendra Modi, 2600 Bed Private Hospital, Health Infrastructure, Mango News, Mango News Telugu,

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో అత్యాధునిక అమృత ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, కేంద్రమంత్రి క్రిషన్ పాల్ గుర్జార్, శ్రీ మాతా అమృతానందమయి తదితరులు పాల్గొన్నారు. మాతా అమృతానందమయి మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 2600 పడకలతో దాదాపు రూ.6000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఆసుపత్రితో ఫరీదాబాద్ మరియు ఎన్సీఆర్ ప్రాంతం ప్రజలకు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందనున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, దేశం అమృత‌కాల్‌ లోకి అడుగుపెట్టి సమిష్టి ఆకాంక్షలు, తీర్మానాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశానికి శ్రీ మాతా అమృతానందమయి ఆశీస్సులు లభించడం సముచితమని అన్నారు. ఈ ఆసుపత్రి ఆధునికత మరియు ఆధ్యాత్మికత యొక్క సమ్మేళనమని, పేద రోగులకు అందుబాటులో మరియు తక్కువ ధరలో చికిత్స అందించే మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు. “అమ్మ ప్రేమ, కరుణ, సేవ మరియు త్యాగం యొక్క స్వరూపం. ఆమె భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయానికి వాహకురాలు” అని ప్రధాని అన్నారు. పూజ్య అమ్మ వంటి సాధువుల రూపంలో ఆధ్యాత్మిక శక్తి ఎల్లప్పుడూ దేశం నలుమూలలా వ్యాపించి ఉండటం దేశం యొక్క అదృష్టమని ఆయన పేర్కొన్నారు. మన మత మరియు సామాజిక సంస్థలు విద్య, వైద్యానికి సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించే ఈ వ్యవస్థ ఒక విధంగా పాత కాలపు పీపీపీ నమూనా అని ప్రధాని అన్నారు. దీనిని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ అంటారు, కానీ నేను దీనిని ‘పరస్పర ప్రయాస్’ (పరస్పర కృషి)గా కూడా చూస్తున్నానని చెప్పారు.

మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌పై కొంతమంది చేస్తున్న ప్రచారంపై ప్రధాని మాట్లాడుతూ, వ్యాక్సిన్ పై సమాజంలో అనేక రకాల వదంతులు వ్యాపించాయి. సమాజంలోని మత పెద్దలు మరియు ఆధ్యాత్మిక గురువులు ఒక్కతాటిపైకి వచ్చి పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలను కోరినప్పుడు, దాని ప్రభావం తక్షణమే వచ్చిందన్నారు. ఇతర దేశాలలో కనిపించే వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యతిరేకతను భారతదేశం ఎదుర్కోలేదని చెప్పారు. ఇక నేడు ప్ర‌తి ఇంటికి పైప్‌డ్ వాట‌ర్ స‌దుపాయం ఉన్న దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల‌లో హ‌ర్యానా ఒక‌టని ప్రధాని అన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారానికి అద్భుతమైన సహకారం అందించినందుకు హర్యానా ప్రజలను అభినందించారు. ఫిట్‌నెస్ మరియు క్రీడలు వంటి అంశాలు హర్యానా సంస్కృతిలో ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు హర్యానా పర్యటన అనంతరం ప్రధాని మోదీ పంజాబ్ లోని మొహాలీకి వెళ్లి ‘హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఇది పంజాబ్ మరియు పొరుగు రాష్ట్రాలు, సమీప కేంద్ర పాలిత ప్రాంతాల నివాసితులకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ సంరక్షణను అందించనుందని తెలిపారు. కేంద్రప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ అయిన టాటా మెమోరియల్ సెంటర్ ద్వారా దాదాపు 660 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ 300 పడకల సామర్థ్యంతో కూడిన తృతీయ సంరక్షణ ఆసుపత్రి కాగా, కాన్సర్ శస్త్రచికిత్స, రేడియోథెరపీ మరియు మెడికల్ ఆంకాలజీ-కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ మరియు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అందుబాటులో ఉన్న ప్రతి చికిత్సా పద్ధతులను ఉపయోగించి అన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఈ ఆసుపత్రి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 13 =