ద్వేషం కాదు దేశం ముఖ్యం, ఉద్వేగాల భారతం కాదు ఉద్యోగాల భారతం ముఖ్యం : మంత్రి కేటీఆర్

Minister KTR Satires on PM Modi Government Says Country is Important not Hate, Telangana Minister KTR Says Country is Important not Hate, Minister KTR Satires on PM Modi Government, KTR Sensational Comments on PM Modi Government, PM Modi Government, Telangana Minister KTR, Minister KTR Satires, Country is Important not Hate, Prime Minister Narendra Modi, Minister KTR News, Minister KTR Latest News And Updates, Minister KTR Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి బీజేపీని విమర్శించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “మోడీ ప్రభుత్వం కాదు, ఇది A-D (అటెన్షన్ డైవర్షన్) ప్రభుత్వం. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర. ఈ కుట్రను కనిపెట్టకపోతే దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం. దేశం కోసం..ధర్మం కోసం…అనేది బీజేపీ అందమైన నినాదం. విద్వేషం కోసం..అధర్మం కోసం..అనేది అసలు రాజకీయ విధానం” అని అన్నారు.

“హర్‌ ఘర్‌ జల్‌ అన్నారు కానీ, హర్‌ ఘర్‌ జహర్‌, హర్ దిల్ మెయిన్ జహార్ నింపే కుట్ర చేస్తున్నారు. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం, విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫాబ్రిక్ ను దెబ్బతీసే కుతంత్రం. మిత్రులారా గుర్తుంచుకోండి..ద్వేషం కాదు దేశం ముఖ్యం. ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం ముఖ్యం. జై హింద్” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఓ వర్గంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యల అనంతరం హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధానత్య సంతరించుకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seventeen =