ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Integrated Ombudsman Scheme, Mango News, PM Modi, PM Modi launches 2 RBI schemes, PM Modi launches 2 RBI schemes for investors, PM Modi launches RBI Retail Direct Scheme, PM Modi Launches RBI’s Retail Direct Scheme, PM Modi Launches RBI’s Retail Direct Scheme and Integrated Ombudsman Scheme Today, pm narendra modi, RBI Schemes, RBI’s Retail Direct Scheme and Integrated Ombudsman Scheme

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12, శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిటైల్ డైరెక్ట్ స్కీమ్ మరియు రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అనే రెండు వినూత్న కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్‌బీఐ వంటి సంస్థలు చేసిన కృషిని ప్రశంసించారు. ఈ అమృత్ మహోత్సవ్ కాలం, 21వ శతాబ్దపు ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాత్ర కూడా చాలా పెద్దదన్నారు. ఆర్‌బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని విశ్వసిస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈరోజు ప్రారంభించిన రెండు ఆర్‌బీఐ పథకాలను ప్రస్తావిస్తూ, ఈ పథకాలు దేశంలో పెట్టుబడుల పరిధిని విస్తరిస్తాయన్నారు. పెట్టుబడిదారులకు మరింత సురక్షితమైన క్యాపిటల్ మార్కెట్‌లకు యాక్సెస్ సులభతరం చేస్తాయని చెప్పారు. రిటైల్ డైరెక్ట్ పథకం దేశంలోని చిన్న పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడికి సులభమైన మరియు సురక్షితమైన మాధ్యమాన్ని అందింస్తుందని చెప్పారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకంతో బ్యాంకింగ్ రంగంలో వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్ సిస్టమ్ రూపుదిద్దుకుందని ప్రధాని మోదీ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =