ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ

Central Government, Chief Minister of West Bengal, Chief Minister of West Bengal Mamata Banerjee, CM Mamata Banerjee Meets PM Narendra Modi, Delhi, Mamata Banerjee, Mamata Banerjee Meet PM Modi, Mamata Banerjee visit Delhi, Mamata visit New Delhi, Mango News, PM Modi, Trinamool Congress, Trinamool Congress President, West Bengal CM, west bengal cm mamata banerjee, West Bengal CM Mamata Banerjee Meets PM Narendra Modi, West Bengal CM Mamata Banerjee Meets PM Narendra Modi at Delhi

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది. భేటీ అనంతరం సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న గ్లోబల్ బిజినెస్ మీట్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. మా మధ్య రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు ఉంటాయని, కానీ రాష్ట్రాలు పురోగమించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అది కేంద్రం మరియు రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేయకూడదని అన్నారు.

బిఎస్ఎఫ్ అధికార పరిధి పొడిగింపు సమస్యపై చర్చించి, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. త్రిపుర హింసపై కూడా ప్రధాని మోదీతో మాట్లాడినట్టు తెలిపారు. ఇక నవంబర్ 30, డిసెంబర్ 1న ముంబయి పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మరియు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలవనున్నట్టు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − four =