మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన: రూ.16,000 కోట్లతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ 3 డాటా సెంటర్ల ఏర్పాటు

Minister KTR Davos Tour Software Giant Microsoft To Invest Rs.16000 Cr For Setup 3 More Data Centers in Hyderabad,Minister KTR Davos Tour,Microsoft To Invest Rs.16000 Cr,Announces to Set up Large,Hyperscale Data Centre,Hyderabad with Rs 16000 Cr,Mango News,Mango News Telugu,WEF's Summit at Davos,KTR Launches Telangana Pavilion,Telangana Pavilion At WEF Davos,Telangana Pavilion,WEF Davos,Minister KTR Davos Tour,Global Healthcare,C4IR Network Signs an MoU,Telangana Govt,World Economic Forum

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో 3 డాటా సెంటర్ల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనలో భాగంగా ఈ భారీ డీల్ కుదిరింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజార్ తో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. హైదరాబాద్‌లో రూ.16,000 కోట్ల పెట్టుబడితో మరో మూడు డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన మైక్రోసాఫ్ట్, హైదరాబాద్‌ను తమ డాటా సెంటర్‌ రీజియన్‌గా పేర్కొంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. తాజా పెట్టుబడితో రెండింటి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. మైక్రోసాఫ్ట్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు డాటా సెంటర్లు హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు కావడం గొప్ప విషయం. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణలో మొత్తం ఆరు డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ క్రమంలో తన మొదటి క్యాప్టివ్ డేటా సెంటర్ పెట్టుబడిని హైదరాబాద్‌లో 2022 ప్రారంభంలో రూ.16,000 కోట్ల పెట్టుబడితో ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఈ 6 డేటా సెంటర్లు రాబోయే 10-15 సంవత్సరాలలో దశల వారీగా అమలు చేయబడతాయని, అలాగే ఈ 6 డాటా సెంటర్ల పెట్టుబడి మొత్తం రూ.32 వేల కోట్లు అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 2 =