ఆర్‌బీఐ యొక్క రెండు ఇన్నోవేటివ్ కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Customer Centric Initiatives, Mango News, News Services Division, PM Modi, PM Modi to launch RBI’s retail direct, PM Modi to Launch Two Innovative Customer Centric Initiatives of RBI, PM Modi to Launch Two Innovative Customer Centric Initiatives of RBI on Tomorrow, PM Modi to launch two innovative customer-centric, PM Modi to launch two innovative customer-centric initiatives, PM to launch two innovative customer centric initiatives of RBI, PM to open government bond market for retail investors, RBI Customer Centric Initiatives

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12, శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ మరియు రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అనే రెండు వినూత్న కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ కూడా హాజరుకానున్నారు.

ఇందులో ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ను రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌కు యాక్సెస్‌ను పెంచే లక్ష్యంతో తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ఈ స్కీమ్ వారికి కొత్త మార్గాన్ని అందించనుంది. ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడిదారులు తమ ప్రభుత్వ సెక్యూరిటీల ఖాతాను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆర్‌బీఐతో సులభంగా తెరవగలరని మరియు నిర్వహించగలరని పేర్కొన్నారు.

మరోవైపు రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ అనే పథకం ఆర్‌బీఐచే నియంత్రించబడే సంస్థలపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి, ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకొస్తున్నారు. ఈ పథకం యొక్క పనితీరు ముఖ్యంగా ‘వన్ నేషన్-వన్ అంబుడ్స్‌మన్’ ఆధారంగా కస్టమర్‌లు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఒక పోర్టల్, ఒక ఇమెయిల్ మరియు ఒక చిరునామాతో రూపొందించబడింది. కస్టమర్‌లు తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి, పత్రాలను సమర్పించడానికి, స్టాటస్ ట్రాక్ చేయడానికి మరియు అభిప్రాయాన్ని అందించడానికి ఒకే పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటుంది. బహుభాషా టోల్-ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం మరియు ఫిర్యాదుల కోసం సహాయంపై సంబంధిత సమాచారాన్ని అంతా అందించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 5 =