భారత్ పవర్ గ్రిడ్‌పై దాడి చేసిన చైనీస్ హ్యాకర్లు.. కీలక సమాచారం తస్కరణ?

Suspected Chinese Hackers Targets and Collect Intelligence From India's Power Grid, Chinese hackers collect intelligence from India's grid, India's Power Grid, Intelligence From India's Power Grid, Chinese Hackers Collect Intelligence From India's Power Grid, Chinese hackers target India's power grid, Suspected state-sponsored Chinese hackers have targeted the power sector in India, power sector in India, India's power sector has been targeted by hackers in a long-term operation, India's power sector, India's power sector Has Been Hacked, Suspected Chinese hackers compromised an Indian national emergency response system, Indian national emergency response system, Suspected Chinese hackers compromised India's Power Grid, India's Power Grid Latest News, India's Power Grid Latest Updates, India's Power Grid Live Updates, Mango News, Mango News Telugu,

సైబర్ గూఢచర్యంలో భాగంగా అనుమానిత చైనీస్ హ్యాకర్లు ఇటీవలి నెలల్లో భారతదేశంలోని విద్యుత్ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారని భారత్ నిపుణులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డ్డ్ ఫ్యూచర్ ఇంక్ బుధవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. చైనీస్ స్టేట్-లింక్డ్ గ్రూపులచే భారతీయ పవర్ గ్రిడ్ ఆస్తులపై దీర్ఘకాలిక లక్ష్యం పరిమిత ఆర్థిక గూఢచర్యం లేదా సాంప్రదాయ గూఢచార సేకరణ చేసే అవకాశాలున్నాయని తెలిపింది. లడఖ్‌లోని వివాదాస్పద భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో గ్రిడ్ నియంత్రణ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాటుచేసిన ఉత్తర భారతదేశంలోని కనీసం ఏడు “లోడ్ డిస్పాచ్” కేంద్రాలపై హ్యాకర్లు దృష్టి సారించారని భావిస్తున్నారు.

లోడ్ డిస్పాచ్ సెంటర్‌లలో ఒకటి గతంలో మరొక హ్యాకింగ్ గ్రూప్ అయిన RedEcho అని, ఇది చైనా ప్రభుత్వంతో ముడిపడి ఉన్న హ్యాకింగ్ గ్రూప్‌గా ఫ్యూచర్ పేర్కొంది. భారతీయ పవర్ గ్రిడ్ ఆస్తులపై చైనా దీర్ఘకాలంగా లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల పరిమిత ఆర్థిక గూఢచర్యం లేదా సాంప్రదాయ గూఢచార సేకరణ అవకాశాలను నిర్వహిస్తోందని అనుమానిస్తున్నారు. దీంతోపాటు చైనా హ్యాకర్లు భారతీయ జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను మరియు బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థతో అనుసంధానమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దీనిపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అలాగే భారత అధికారులు కూడా సైబర్ యాక్టివిటీలో బీజింగ్ ప్రమేయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twelve =