ఏపీలో హీట్ పెంచిన అమిత్ షా కామెంట్లు

AP Politics, Amit Shah's comments, political heat,Amit Shah,Jagan, Chandrababu, TDP, YCP, Jana Sena, BJP, Andhra Pradesh News Updates, AP Political News, AP Elections, Mango News Telugu, Mango News
AP Political , Amit Shah's comments, political heat,Amit Shah,Jagan, Chandrababu, TDP, YCP, Jana Sena, BJP,

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దేశంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా.. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోయే పనిలో పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసుకుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలతో ఇటీవలే కొన్ని పార్టీలు ఇండియా కూటమి నుంచి  విడిపోయి స్వతంత్రంగా ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించాయి. కూటమి నుంచి బయటకు వచ్చిన మరికొన్ని పార్టీలు.. బీజేపీతో జతకట్టే ఆలోచనలో ఉన్నాయి.

మరోవైపు బీజేపీ ప్రధాన పార్టీగా ఉన్న మరో కూటమి  ఎన్డీఏలో ఇప్పటికే బీజేపీకి మెజారిటీ స్థానాలు ఉన్నాయి. దీంతోనే బీజేపీ ఇంకా పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పొత్తులపై బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతున్నాయి.

కాసేపటి క్రితం ఎకనామిక్ టైమ్స్ లో మాట్లాడిన అమిత్ షా.. పొత్తులపై తాము త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. పొత్తుల అంశం కొద్ది రోజుల్లోనే కొలిక్కి వస్తుందని అన్నారు. అంతేకాకుండా ఎన్డీఏలో చేరడానికి చాలా ప్రాంతీయ పార్టీలు ఆసక్తిగా ఉన్నాయని, ఎన్డీఏలోకి కొత్త మిత్రులు రాబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అమిత్ షా చేసిన కామెంట్లతో..తాజాగా చంద్రబాబు భేటీ విజయవంతం అయినట్లేనా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే జగన్‌ను గద్దె దించడానికి టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళుతున్నాయి.  ఇదివరకే జనసేన, బీజేపీతో పొత్తులోనే ఉండగా..తాజా పరిణామాలతో  చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ పొత్తు  కుదిరిందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ టీడీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఏపీ రాజకీయాల్లో కొత్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. టీడీపీ,జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి కసరత్తులు చేస్తున్నాయి. సీట్లు ప్రకటించకముందే రెండు పార్టీల నేతలు టికెట్లపై గంపెడాశలు పెట్టుకున్నారు. మరికొంతమంది అయితే టికెట్ కోసం నానా రభస చేస్తున్నారు.

ఇప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి పొత్తు పెట్టుకొని సీట్లను సర్ధుబాటు చేసుకుంటే..కూటమి పార్టీల కార్యకర్తలు, ఆశావాహులు టికెట్ దక్కించుకున్న నేతలకు సపోర్టు చేసి గెలిపిస్తారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోలాగే అసంతృప్తులు పెరిగిపోయి కూటమికి  చేటు చేస్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =