కరోనా పరిస్థితిపై వైద్యులు, ఫార్మా కంపెనీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష

COVID-19 Situation, Mango News, Modi will Interact with Leading Doctors and Pharma Companies, PM Modi interacts with leading doctors, PM Modi to interact with doctors, PM Modi to interact with doctors pharma companies, PM Modi to interact with leading doctors, PM Modi to virtually interact with doctors, PM Modi will Interact with Leading Doctors, PM Modi will Interact with Leading Doctors and Pharma Companies, PM Modi will Interact with Leading Doctors and Pharma Companies on Covid-19 Situation

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కేసులు, 1619 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా సోమవారం ఉదయం పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా వ్యాప్తి‌ కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివర్ ఇంజెక్షన్స్ అందుబాటు సహా పలు అంశాలపై అధికారులతో ప్రధాని మోదీ చర్చించినట్టు తెలుస్తుంది.

మరోవైపు సోమవారం సాయంత్రం 4 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులుతో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు దేశంలోని టాప్ ఫార్మా కంపెనీలతో కూడా ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. పలురాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ల కొరత, ఆక్సిజన్ సరఫరా మరియు రెమ్‌డెసివిర్ పై నివేదికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు ప్రాధానత్య సంతరించుకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =